రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం హీరో.. ఈ చిత్రం ని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా అశోక్ గల్లా హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, నరేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ , సత్య తో పాటు పలువురు నటులు  ప్రముఖ పాత్రల్లో నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక అమర్ రాజా మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ బోర్డ్ ఫార్మాలిటీ  పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 15వ తేదీన సంక్రాంతి కానుకగా థియేటర్లలో చాలా గ్రాండ్ గా  రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇందుకు సంబంధించిన ట్విట్టర్ కూడా వైరల్ అవుతోంది.హీరో కి సంబంధించి సెన్సార్ బోర్డు పనులు పూర్తి చేసుకుంది.. జనవరి 15వ తేదీన విడుదల చేస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించడం.. ఒక పోస్టర్ ని కూడా హీరో సినిమా నుంచి విడుదల చేయడం గమనార్హం.. ఇందులో ట్రైన్ కంటే వేగంగా గుర్రపు స్వారీ చేస్తూ దూసుకెళ్తున్నారు అశోక్ గల్లా.. ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరు  సవారితో దూసుకెళ్తున్నాడు మన హీరో అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా పై మరింత ఆసక్తి నెలకొంటుంది.. రామజోగయ్య శాస్త్రి అందించిన పాటలు వినడానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.సినిమా నుంచి విడుదలైన లిరికల్ సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇక టీజర్ కూడా మంచి విశేష ఆదరణ పొందడంతో పాటు అతి తక్కువ సమయంలోనే ఐదు మిలియన్ల వ్యూస్ ను సంపాదించుకోవడం గమనార్హం. ఇకపోతే సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ యంగ్ హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలుసు కోవాలంటే సినిమా విడుదలయ్యే వరకూ ఎదురుచూడక తప్పదు..

మరింత సమాచారం తెలుసుకోండి: