12 ఎకరాల్లో వేసే ఈ సెట్ కోసం దాదాపు 12 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది. నాని కెరియర్ లో ఇప్పటివరకు రీసెంట్ గా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమానే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ కాగా దసరా అంతకుమించిన బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది. చెరుకూరి సుధాకర్ ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమా కు ఎంత బడ్జెట్ అయినా పెట్టే ఆలోచన లో ఉన్నారట. తెలంగాణా బ్యాక్ డ్రాప్ తో పీరియాడికల్ మూవీగా వస్తున్న నాని దసరా మూవీ కేవలం తెలుగు లోనే కాకుండా సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
నాని, కీర్తి సురేష్ ఆల్రెడీ నేను లోకల్ సినిమాలో నటించారు. మళ్లీ ఈ ఇద్దరు కలిసి దసరా సినిమాలో కలిసి చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. నాని ప్రస్తుతం అంటే సుందరానికీ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. త్వరలోనే పూర్తి స్థాయి లో దసరా సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. దసరా కోసం భారీ సెట్ సిద్ధం చేస్తున్నారు. ఈ సెట్ పూర్తి చేసి సినిమా మొత్తం దాదాపు ఆ సెట్ లోనే పూర్తి చేస్తారని తెలుస్తుంది.