ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోల తర్వాత ఉన్న యంగ్ హీరోలలో అగ్రపథంలో దూసుకెళ్తున్నారు మాస్ మహారాజ రవితేజ. గత సంవత్సరం క్రాక్ మూవీ ఇచ్చిన విజయంతో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి రమేష్ వర్మ డైరెక్షన్ లో రూపు దిద్దుకొంటున్న 'ఖిలాడి'. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుండి వస్తున్న ప్రతి ఒక్క అప్ డేట్ ప్రేక్షకులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు మూడు పాటలను రిలీజ్ చేసింది, దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రం నుండి తర్వాత పాట కోసం అభిమానులు ఎదురుచూశారు.

కాగా నేడు మాస్ మహారాజ రవితేజ పుట్టిన రోజు సందర్భంగా తన తాజా చిత్రం నుండి లేటెస్ట్ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. వాస్తవంగా అయితే ఈ రోజు నాలుగవ సాంగ్ ను ఉదయం 10 గంటలకే విడుదల చేయాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన 'ఫుల్ కిక్కు' అంటూ సాగే సాంగ్ ను నేడు రవితేజ బర్త్డే సందర్భంగా సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ విషయంపై ముందుండే టాక్ నడుస్తుండగా ఇపుడు ఈ విషయం పై క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నారు.

ఇక ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అన్న దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యింది. అందులోనూ ఈ సినిమాకి సంగీతం అందిస్తోంది దేవి శ్రీ ప్రసాద్ ఇక ఈ పాటకు కూడా మంచి బీట్ తో అదరగొట్టుంటారు అంటూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 4 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: