భారతీయ సంగీత దిగ్గజం ఏ ఆర్ రెహమాన్ తెలుగు లో ఎన్ని సినిమాలు చేశాడు అంటే వేళ్ళ మీదే ఆయన చేసిన సినిమాలను లెక్క పెట్టవచ్చు. తమిళ సినిమా పరిశ్రమలో హిందీ సినిమా పరిశ్రమలో చేసిన సినిమాలు ఎందుకో తెలుగులో చెయ్యలేదనే చెప్పాలి. అయితే తెలుగులో రెహమాన్ సినిమాలు పెద్దగా చేయకపోవడంపై ఓ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ప్రకారం మన హీరోలు దర్శక నిర్మాతలు ఆయనకు సినిమా అవకాశం ఇవ్వాలంటే వెనకడుగు వేశారు.

సూపర్ పోలీస్ అనే చిత్రాన్ని తెలుగులో చేసి ఇక్కడ తన కెరీర్ ను ప్రారంభించిన రెహమాన్ ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసి మంచి సంగీత దర్శకుడిగా ఎదిగాడు.  అయితే రెహమాన్ కు ఆ సినిమాల విజయాలు ఏ మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. ఆ చిత్రాలు భారీ ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా ఆయన తెలుగులో ఐరన్ లెగ్ గా అవతరించాడు. దాంతో ఆయనకు ఏ దర్శకనిర్మాతలు కూడా సినిమాలు ఇవ్వడానికి ముందుకు రాలేదని చెప్పాలి. చివరగా తెలుగు లో ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమా కొమరం పులి చిత్రం కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. పవన్ కెరీర్లోనే ఈ చిత్రం భారీ ఫ్లాప్ గా నిలిచింది.

ఇకపోతే రెహమాన్ తన డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. అయితే డబ్బింగ్ సినిమాల ద్వారా కాకుండా ఆయన డైరెక్ట్ తెలుగు సినిమాలతో అలరించకపోవడం ఒకసారి అందరిని నిరాశపరుస్తుంది. దాంతో ఆయన ఎప్పుడు తెలుగులో సినిమా చేస్తారో అని ఎదురు చూస్తూ ఉండగా ఆయనకు ఇప్పుడు ఓ అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ శిష్యుడు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమా చేస్తున్న తరుణంలో ఆ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎ ఆర్ రెహమాన్ ను ఎంచుకోవాలని సదరు దర్శకుడు భావిస్తుండగా దానికి రెహమాన్ ఒప్పుకునే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమా తో అయినా రెహమాన్ తెలుగు లో వరుస సినిమాలు చేస్తాడా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: