టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ మార్చి 18న లేదా ఏప్రిల్ 28న తేదీల్లో రిలీజ్ కానున్నట్లు ఇటీవల యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుండి ఇటీవల తెరకెక్కించిన బాహుబలి 2 వరకు వరుసగా తన సినీ కెరీర్ లో చేసిన సినిమాలు అన్నిటితో పెద్ద సక్సెస్ లు అందుకుంటూ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి, తప్పకుండా ఈ ఆర్ఆర్ఆర్ మూవీ తో కూడా పెద్ద సక్సెస్ అందుకోవడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీని డివివి దానయ్య నిర్మించారు. ఇక తన సినిమాలలో పని చేసే వారిలో ఎవరికైనా ఏదైనా జరిగితే తన వంతుగా వారికి సాయం అందించడంతో పాటు సినిమా ఇండస్ట్రీ కి చెందిన వారు ఎవరైనా కష్టంలో ఉంటె వారికి ఎంతో కొంత ఆర్ధిక సహాయం అందించడంలో రాజమౌళి ముందు ఉంటారు. ఆవిధంగా పలు సందర్భాల్లో తన దాతృత్వాన్ని చాటుకున్న రాజమౌళి, లేటెస్ట్ గా తన బాహుబలి సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కో ఆర్డినేటర్ గా పని చేసిన దేవిక అనే ఆమెకి హఠాత్తుగా బ్లడ్ కాన్సర్ వ్యాధి సోకడంతో ఆమెకి తమ వంతుగా వీలైనంతలో దాతలు విరాళాలు అందించి ఆదుకోవాలని కోరుతూ రాజమౌళి కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేసారు.

అయితే రాజమౌళి చేసిన ఈ ట్వీట్ పై ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. మీవంతుగా గతంలో పలువురికి సాయం అందించిన మీరు, మీ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆమెకు సాయం చేయవచ్చుగా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరేమో ప్రస్తుతం ఒక్కో సినిమాకి కోట్లాది రూపాయల పారితోషికం తీసుకుంటున్న మీరే ఆమెకు సాయం చేయవచ్చు కదా, ఇలా ట్వీట్ చేసి మమ్మల్ని విరాళాలు ఇవ్వమని కోరడం ఏమి బాగోలేదు రాజమౌళి గారు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ ట్వీట్ సోషల్ మేడలో వైరల్ గా మారింది.      

మరింత సమాచారం తెలుసుకోండి: