హర్ష్ కనుమిల్లి ఇంకా అలాగే సిమ్రాన్ చౌదరి కలిసి జంటగా నటించిన క్రేజీ రోమ్-కామ్ చిత్రం సెహరి మొత్తానికి థియేట్రికల్ గా విడుదలకు రెడీ అవుతుంది. జ్ఞానసాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అసలు ఎప్పుడో విడుదల కావాల్సింది.కానీ కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల వల్ల సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతుండగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ తోనే ఈ సినిమా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే క్రియేట్ చేస్తోంది.ట్రైలర్ లో హీరో హర్ష్ కనుమిల్లి తన సోల్ మేట్ కోసం వెతికే క్రమంలో విభిన్నమైన అనుభవాలను ఎదుర్కొంటున్నట్లుగా చూస్తే అర్ధమవుతోంది. అతను కలిసే అమ్మాయిలందరినీ తన లవర్ గా ఫీల్ అయ్యే అతను తన అమాయకత్వం కారణంగా విడిపోతు వుంటారు. చివరగా తన ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న హీరోయిన్ సిమ్రాన్ చౌదరిని కలుస్తాడు.

ఇక ఇంతలో ఇంట్లో వాళ్ళు పెళ్లికి రెడీ చేస్తారు. అయితే, సినిమా కథలో ట్విస్ట్ ఏమిటంటే.. ఆమె తన కాబోయే భార్యకు అక్కయ్యి ఉంటుంది. అతని కంటే ఆమె నాలుగేళ్లు పెద్దది.జ్ఞానసాగర్ ద్వారక అన్ని వర్గాలకు నచ్చేలా ఈ సినిమాను సరైన ఎలిమెంట్స్‌తో కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. యూత్‌ని బాగా ఆకట్టుకునే కథను ఎంచుకున్నారు. హీరో పాత్రతో పాటు సంగీతం కూడా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నట్లు సమాచారం. హర్ష్ కనుమిల్లి తన అమాయకమైన నటనతో బాగా హైలెట్ అవుతున్నాడు. పాత్ర అతనికి తగినట్లుగా ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో నందు కూడా ప్రత్యేక పాత్రలో కనిపించాడు. హర్ష్ తండ్రిగా సంగీత దర్శకుడు కోటి నటించాడు. ఇక ఈ చిత్రాన్ని విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మిస్తున్నారు. హర్ష కనుమిల్లి ఈ సినిమాకి రచయిత కూడా. ప్రశాంత్ ఆర్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక సెహరి సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: