టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు అవసరాల శ్రీనివాస్. కేవలం నటుడిగానే కాదు దర్శకుడిగా, రచయితగా ఇలా మల్టీ టాలెంటె తో ప్రేక్షకులను కొన్ని సినిమాలతో అలరించాడు. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో కొన్ని కీలక పాత్రలో నటిస్తున్నాడు అవసరాల. ఇక ఇదిలా ఉంటే తన పర్సనల్ విషయాల గురించి ఓ సందర్భంలో ఈ హీరో తెలియజేశాడు. ముఖ్యంగా పెళ్ళి అంటే ఆమడ దూరంలో ఉంటున్నాడు అవసరాల శ్రీనివాస్. దానికి కారణం ఏంటంటే తన అమ్మానాన్నలతో ఇప్పటికే పెళ్లి విషయం గురించి శ్రీనివాస్ మాట్లాడడం జరిగిందట.

అయితే 2016లో ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ మాట్లాడుతూ..' తన దగ్గర డబ్బులు లేవని.. అందుకే వివాహం చేసుకోలేదని తెలియజేశాడు. అయితే ఇప్పుడు వివాహం అంటే వద్దంటున్నాడు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ మాట్లాడుతూ..' తాను పుట్టింది కాకినాడ. చదువుకుంది హైదరాబాద్. మధ్యలో డిగ్రీ విజయవాడలో చేశానని తిరిగి ఇంజనీరింగ్ హైదరాబాద్ కి వచ్చాను అని తెలియజేశారు. వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయాన్ని తన ఇంట్లో చెప్పానని, మా నాన్నగారు అయితే నా నిర్ణయం చెప్పగానే జెలసీ ఫీల్ అయ్యారు అని తెలియజేశాడు.

తన తండ్రి తనకి చాలా బాగా క్లోజ్ అని, పెళ్లి వద్దన్నా కూడా ఇదేదో బాగుంది అనే ఫీలింగ్ ఆయనకు కలిగింది అని తెలియజేశాడు శ్రీనివాస్. అయితే తాను తీసుకున్న నిర్ణయంతో తన తండ్రి కూడా హ్యాపీగా ఉన్నారని తెలియజేశాడు. ఒక వయస్సు వచ్చిన తర్వాత తీసుకునే నిర్ణయం కాదు ఇది. ఓపిక లేక తీసుకున్న నిర్ణయం అని.. ఇక ఈ నిర్ణయం తీసుకోవడానికి పెద్ద కారణాలేమీ లేవు అనుభవపూర్వకంగా నిర్ణయాలు తీసుకోవడం అది కేవలం మన భ్రమ అని తెలియజేశాడు అవసరాల శ్రీనివాస్. ఇక దర్శకుడిగా ఈయన ఊహలు గుసగుసలాడే జోఅచ్యుతానంద వంటి సినిమాలు తీశాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: