వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కిలాడి క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రవితేజ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో రవితేజ కు జోడీగా మీనాక్షి చౌదరి డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటించగా అనసూయ రావు రమేష్ యాక్షన్ కింగ్ అర్జున్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. కోనేరు సత్యనారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న తరహా పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పాటల కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. 

ఇక ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయినట్లు సమాచారం. సెన్సార్ యూనిట్ ఈ సినిమాకి యు బై ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే ఈ సినిమా రన్ టైం 154 నిమిషాలకు సెట్ చేసినట్లు తెలుస్తోంది. అంటే సరిగ్గా ఈ సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాలు ఉండం ఉన్నట్లు సమాచారం. ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియా లో భారీ రెస్పాన్స్ కనబడింది ట్రైలర్లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు కామెడీ రొమాన్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఈ సినిమాలో రవితేజ ఏకంగా హీరోయిన్స్ తో లిప్ లాక్ సీన్ లో కూడా నటించాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ఇటీవల రాక్షసుడు సినిమా తో మంచి హిట్ అందుకున్న దర్శకుడు రమేష్ వర్మసినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సమాచారం. ఇక గత ఏడాది క్రాక్ సినిమాతో బోణి కొట్టిన రవితేజ అ ఇప్పుడు ఈ ఏడాది కిలాడి సినిమాతో అదే రిపీట్ చేయబోతున్నాడని ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు. మరి ఆ నమ్మకాలని కిలాడి ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: