హీరోయిన్ ఈషా రెబ్బ.. తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. దాదాపు ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చి ఏడు సంవత్సరాలు కావస్తోంది. కానీ ఈ అమ్మడుకు  ఇప్పటి వరకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు. ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడికి ప్రేక్షకుల నుంచి ఆదరణ మాత్రం కరువైంది. కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఒక్క సినిమాతోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ఉంటే.. ఇప్పటి వరకు అరడజనుకు పైగా సినిమాలు చేసిన ఈషా రెబ్బా మాత్రం పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేక పోతుంది. అయితే అరవింద సమేత లాంటి సినిమాలో ఈ అమ్మడు కనిపించింది. కానీ చాలామందికి ఈ హీరోయిన్ ఆ సినిమాలో ఉంది అన్న విషయం కూడా తెలియదు.



 అయితే తెలుగు హీరోయిన్లకు టాలీవుడ్ లో మంచి ఛాన్సులు దొరకవు అంటూ ఎన్నో రోజుల నుంచి ఒక టాక్ వినిపిస్తోంది. ఇది తప్పు అని నిరూపించడానికి ఎంతో మంది హీరోయిన్లు తెరమీదికి  వచ్చిన వారికి అవకాశాలు రాక ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు. అయితే మొన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూసిన ఈషా రెబ్బ ఇక ఇప్పుడు మిగిలిన ఇండస్ట్రీలో పై కూడా ఫోకస్ పెట్టింది అన్నది తెలుస్తుంది. దీంతో సాదాసీదా హీరోయిన్ కాదు ఏకంగా హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ క్రేజీ హీరోయిన్ గా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.



 మొన్నటివరకూ అందాల ఆరబోతకు లిప్ లాక్ సీన్లకు ఇంటిమేట్ సీన్ల కు దూరంగా ఉన్న ఈషా రెబ్బ ఇప్పుడు మాత్రం అలాంటి సన్నివేశాల్లో నటించడానికి కూడా రెడీ అయ్యింది.. ఇటీవలే మలయాళ  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. మలయాళం స్టార్ హీరో కుంచుకో బొబస్ సరసన ఒట్టు అనే సినిమాలో నటిస్తోంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఒక పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో లిప్ లాక్ బెడ్ రూమ్ సీన్స్ లలో రెచ్చిపోయింది ఈషా రెబ్బ.  ఈ సాంగ్ చూసిన తర్వాత అటు అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు.. మరి ఈ సినిమాతో అయినా ఈషా రెబ్బా ట్రాక్ లోకి వచ్చి మంచి అవకాశాలు అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: