ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు,  పోయిన సంవత్సరం మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ సినిమా మంచి విజయాన్ని సాధించింది.  ఈ సినిమా మంచి విజయం సాధించడంతో రవితేజ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు,  అయితే తాజాగా రవితేజ,  రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి సినిమాలో హీరోగా నటించాడు.   ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది,   ప్రస్తుతం కూడా ఈ సినిమా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. 

 ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం ఖిలాడి సినిమాతో   ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ప్రస్తుతం కూడా వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నాడు,  అందులో భాగంగా రవితేజ ప్రస్తుతం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.  త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఇప్పటికే సినిమా చూపిస్త మావ,  నేను లోకల్ , హలో గురు ప్రేమకోసమే లాంటి సినిమలు తెరకెక్కాయి, ఈ సినిమాలు కూడా మంచి విజయాలను సాధించాయి,  ఈ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో త్రినాథరావు నక్కిన దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ తో ధమాకా సినిమాను తెరకెక్కిస్తున్నాడు,  అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పాట్ కు సంబంధించిన ఒక ఫోటోను రవితేజ తన ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు,  రవితేజ పోస్ట్ చేసిన ఈ ఫోటో ద్వారా ధమాకా సినిమా షూటింగ్ నైట్ షెడ్యూల్ జరుగుతున్నట్లు తెలియజేశాడు,  ఇలా రవితేజ డే అండ్ నైట్ ధమాకా సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: