ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. హెరిటేజ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కగా ఈ చిత్రం పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పవచ్చు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడం కూడా ఈ సినిమాపై అంచనాలు ఏర్పడడానికి ముఖ్యకారణం. సాహో సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచిన కూడా కొన్ని వర్గాల ప్రేక్షకులను అలరించ లేక పోయింది.

దాని ఫలితాన్ని దృష్టిలో ఉంచుకొని అందరినీ ఆశ్చర్య పరిచేలా చేయాలని ప్రభాస్ సినిమా ఇంతటి భారీ స్థాయిలో తెరకెక్కించడం మొదలుపెట్టాడు. గత కొంతకాలంగా విడుదల వాయిదా పడుతూ ఉన్నా కూడా దీని క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు అంటే ఈ సినిమా యొక్క స్థాయి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను భారీ స్థాయిలో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా షాకింగ్ న్యూస్ ఒకటి బయటపడింది. ప్రభాస్ లాంటి యాక్షన్ హీరో నటిస్తున్న ఈ సినిమాలో విలన్ లేకుండా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి.

అంతే కాదు ఈ సినిమాలో  బోట్ ప్రమాదంలో చిక్కుకున్న ప్రజలను హీరో ఎలా కాపాడాడు అనే అంశం చాలా బాగుంటుందని 20 నిమిషాల పాటు సాగే ఈ క్లైమాక్స్ భారీ స్థాయిలో ప్రేక్షకులను అబ్బుర పరిచేలా ఉంటుందని యూనిట్ చెబుతుంది. హీరో ఇందులో హస్తసాముద్రికుడు గా సరికొత్త పాత్రలో నటించబోతున్నారు. ఇతరుల మిండ్ రీడ్ చేయగల సామర్థ్యం ఉన్న హీరో ప్రేమ విధి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా కథ. ఇక ఈ సినిమాలో విలన్ ఎవరు అంటే విధి కల్పించే పరిస్థితులే అని చెప్పాలి. ఈ పరిస్థితులే ప్రధాన భూమిక పోషించాయని ఇందులో ప్రత్యేకమైన విలన్ అంటూ ఎవరు లేరని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: