విభిన్నమైన కాన్సెప్ట్ ను ఎంచుకుంటూ.. తనదైన శైలిలో సినిమాలను తీస్తున్నాడు హీరో ఆది పినిశెట్టి.. గుండెల్లో గోదారి, రంగస్థలం వంటి సినిమాలలో ఎంతో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించాడు. ఇకపోతే ఇతడు నటించిన తదుపరి చిత్రం క్లాప్.. ఈ సినిమాని ఓటీటీ వేదికగా ప్రదర్శించనున్నట్లు ఇటీవల సోనీ లైవ్ ప్రకటించడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించి ఓ టీ టీ లో ఈ రోజు థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా గా ప్రేక్షకులను బాగా రక్తికట్టించింది. ఇందులో ఆది ని అంగవైకల్యం కలిగిన అథ్లెట్గా చూపించడం గమనార్హం.

జాతీయ చాంపియన్షిప్ కోసం ఒక చిన్న గ్రామానికి చెందిన యువ మహిళ అథ్లెట్ గురించి తెలిసి ఆమెకు శిక్షణ ఇవ్వమని ఎంతో మంది కోచ్ లను అడుగుతాడు కానీ ఎవరు కూడా ఒప్పుకోరు. ఆ తర్వాత ఆమెకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకోడం జరుగుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? ఆమె జాతీయ చాంపియన్షిప్ టైటిల్ ను  కైవసం చేసుకుంటుందా.. ? లేదా..? అనేది ఈ సినిమా కథాంశం. ఇకపోతే ఎమోషనల్ రగిలించేందుకు చాలా స్కోప్ కనిపిస్తోంది ఈ సినిమాలో.. ఆది పినిశెట్టి లాంటి హీరో పర్ఫార్మర్ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.


ఈ చిత్రం 2022 మార్చి 11వ తేదీన సోనీ లైవ్ లో ప్రదర్శించబడుతుంది అని ధ్రువీకరించారు సోనీ లైవ్ అధికారులు. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ ,నాజర్ , ఆకాంక్ష సింగ్,  కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక మాస్ట్రో సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా  తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటివరకూ వచ్చిన అన్ని స్పోర్ట్స్ బేస్డ్ సినిమాల కంటే కాస్త విభిన్నంగా ఉండబోతోందని విశ్లేషకుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో మరింత విజయాన్ని ఆది పినిశెట్టి సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: