‘శాంతినివాసం’ సీరియల్ కు దర్శకత్వం వహించే రోజులలో ఒక పాత స్కూటర్ పై రాజమౌళి ప్రతిరోజు ఆ సీరియల్ షూటింగ్ కు వెళ్ళేవాడట. ఆ సీరియల్ తీస్తున్న రోజులలో ఆ సీరియల్ లో నటించిన నటుడు రంగనాథ్ దర్శకుడుగా రాజమౌళి సక్సస్ కాగలడా అంటూ అప్పట్లో సందేహాలు వ్యక్తపరిచేవాడట.


అయితే ఆతరువాత దర్శకుడుగా మారిన రాజమౌళి వరసపెట్టి బ్లాక్ బష్టర్ హిట్స్ కొడుతూ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సెలెబ్రెటీగా మారిపోయాడు. తాను తీసే సినిమా కథలో ఒక పాత్రను ఎక్కడ ప్రారంభించాలో ఎక్కడ ముగించాలో జక్కన్నకు తెలిసినంతగా మరి ఏ ప్రముఖ దర్శకుడుకు తెలియదు. ప్రస్తుతం ఆయన లేటెస్ట్ మూవీ 'ఆర్ ఆర్ ఆర్' పై కూడ భారీ అంచనాలు ఉన్నాయి.



ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల అవుతున్న నేపథ్యంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు ‘నాకు ఫెయిల్యూర్ అంటే భయం ఎక్కువ. ఆ భయం వల్లనే నేను ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను. ఆ భయం వల్లనే ఒక మేజిక్ జరుగుతుంది. నా ప్రతి సినిమా కూడా అంతకుముందు సినిమాకి మించి ఉండాలనే ఒక బలమైన సంకల్పం వల్లనే నేను అనుకున్నది చేస్తూ ముందుకు వెళుతుంటాను. ప్రతి సినిమాను మాత్రమే కాదు ప్రతి దృశ్యాన్ని తెరపై కొత్తగా ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాను’ అంటూ తన సక్సస్ సీక్రెట్ ను బయటపెట్టాడు.


ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గర్వించే గొప్ప దర్శకుడుగా రాజమౌళి మారినా ఎటువంటి వివాదాలకు అదేవిధంగా ఎటువంటి గాసిప్పులకు తన వ్యక్తిగత జీవితంలో అవకాశం ఇవ్వకుండా ఎంతటి గొప్ప హీరో అయినా రాజమౌళి సినిమాలలో అవకాశం ఇస్తే చాలు అనే స్థాయికి ఎదిగాడు. అంచనాలను అనుగుణంగా ‘ఆర్ ఆర్ ఆర్’ ఘనవిజయం సాధిస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు అందుకోలేని ఉన్నత స్థానానికి రాజమౌళి చేరుకుంటాడు..




మరింత సమాచారం తెలుసుకోండి: