మాస్ మహారాజా రవితేజ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  రవితేజ కెరియర్ లో ఎన్నో హిట్,  సూపర్ హిట్,  బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోలలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న మాస్ మహారాజ రవితేజ గత కొంత కాలం నుండి వరుస పరాజయాలతో డీలా పడిపోయి ఉన్నాడు, అలా వరుస పరాజయాలతో డీలా పడిపోయిన మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం విడుదలైన క్రాక్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. క్రాక్ మూవీ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఈ సంవత్సరం విడుదల అయిన ఖిలాడి మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ ను ఎదుర్కొన్నాడు,  ఇలా ఖిలాడి సినిమాతో అభిమానులను నిరాశ పరిచిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.

 అందులో భాగంగా ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు,  ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.  ఈ మూవీ తో పాటు సినిమా చూపిస్త మావ,  నేను లోకల్ , హలో గురు ప్రేమ కోసమేరా సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా మూవీ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్నాడు,  ఈ మూవీ షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.  ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ సరసన పెళ్లి సందD బ్యూటీ శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది,  ఈ సినిమాలతో పాటు మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు మూవీ లో కూడా నటించబోతున్నాడు,  ఇలా వరుస మూవీలతో మాస్ మహారాజ రవితేజ ఫుల్ స్పీడ్ మీదున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: