కొత్త బంగారు లోకం  ఈ సినిమాని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు .ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శ్రీకాంత్ అడ్డాలని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ఇది .అయితే శ్వేతా బసు ప్రసాద్ ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ విషయం అందరికీ తెలిసిందే .ఇకపోతే ఈ సినిమా కాలేజీ బ్యాక్ గ్రాప్, టీనేజ్ లవర్ స్టోరీ, సున్నీతమైన భాగోద్వేగాలతో తెరకెక్కిన  సూపర్ డూపర్ హిట్ అవడం మనం చూసాం.అంతేకాదు  దిల్ రాజుకి ఇది ఏడో సినిమా కావడం విశేషం.కాగా  ముందుగా ఈ సినిమాతో అక్కినేని నాగచైతన్యని హీరోగా లాంచ్ చేయాలన్న ప్రపోజల్‌ని నాగార్జున ముందుకు తీసుకెళ్ళారట దిల్ రాజు..

అయితే  సాఫ్ట్ మూవీ కావడం, యాక్షన్ ఎపిసోడ్స్‌కి పెద్దగా స్కోప్ లేకపోవడంతో చైతూ డెబ్యూ మూవీకి ఇది కరెక్ట్ కాదని రిజెక్ట్ చేశారట నాగార్జున. అయితే ఈ విషయాన్ని దిల్ రాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం జరిగింది. ఇకపోతే  ఆ తర్వాత చైతూ ప్లేస్‌లో వరుణ్ సందేశ్ ని తీసుకున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో దిల్ రాజు పైన నాగార్జునకి మరింత కాన్ఫిడెంట్ పెరిగింది కాగా ఆ తర్వాత జోష్ కథతో నాగార్జునని అప్రోచ్ అయ్యారట దిల్ రాజు..అయితే  అది కూడా కాలేజీ బ్యాక్ గ్రాప్ స్టోరీ కావడం, శివ లాంటి టచింగ్ పాయింట్‌లు మూవీలో ఉండడంతో నాగచైతన్యని హీరోగా లాంచ్ చేసే ఛాన్స్ దిల్ రాజుకి అప్పగించారట హీరో నాగార్జున.

ఇక ఈ కథని ముందుగా రామ్ చరణ్ కి వినిపిస్తే బాగుందని అన్నాడట.. అయితే  చిరంజీవి రిజెక్ట్ చేయడంతో కథ నాగార్జున దగ్గరికి వెళ్లిందట. కాగా నాగచైతన్యకి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చింది ఈ చిత్రం. ఇక ప్రస్తుతం నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' అనే సినిమాలో నటించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటు అదే డైరెక్టర్ తో వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ కి 'దూత' అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఇటీవల ఈ వెబ్ సిరీస్ షూటింగులో కూడా జాయిన్ అయ్యాడు చైతూ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: