ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న మూవీ ఏదైనా ఉంది అంటే అది ' ఆర్ఆర్ఆర్'. ఇకపోతే ఈ సినిమా ఈనెల 25న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. అంతేకాదు ప్యాన్ ఇండియా సినిమాగా… తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మళయాళం భాషల్లో విడుదల కాబోతోంది.అయితే దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తరువాత వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇమ ఇదిలా వుండగా మరోవైపు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియాభట్, అజయ్ దేవ్ గన్ నటిస్తుండటంతో అందరిలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

ఇకపోతే  చారిత్రక కల్పిక కథతో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తున్నారు.కాగా ఈ సినిమా విడుదలకు కేవలం ఒకే రోజు ఉంది. ఇకపోతే చారిత్రక కథాంశం కావడంతో సినిమా నిడివి కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఈ సినిమా తెలుగుతో పాటు సౌత్ లో రన్ టైం 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లుగా ఉంది. ఇదిలా ఉంటె  మరోవైపు హిందీలో మాత్రం రన్ టైం మరింతగా ఎక్కువగా ఉండబోతోంది. అయితే ఈ సినిమా హిందీలో 3 గంటల 10 నిమిషాలు ఉండబోతోంది.ఇక తాజా సమాచారం ప్రకారం హిందీలో రన్ టైం పెరగడానికి ప్రధానం కారణం వేరేగా ఉందని ఫిలింనగర్ లో నుండి తున్న అందుతున్న సమాచారం.

అయితే  అజయ్ దేవ్ గన్, అలియా భట్ పాత్రలు ఉండటంతో హిందీలో రన్ టైంపెరిగినట్లు సమచారం. అంతేకాకుండా వీరిద్దరి కోసమే రన్ పెంచారని తెలుస్తోంది. సుమారు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, శ్రియ శరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR