టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి పరుస్తూ ఉంటాయి. ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా కూడా ఈ తరహా కాన్సెప్టు ఉన్న చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి పరుస్తాయి. అలా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్. ఇప్పుడు తన తదుపరి చిత్రంగా మిషన్ ఇంపాజిబుల్ అనే చిత్రాన్ని ఈ వారం విడుదల చేయడానికి సిద్ధం చేశాడు. తొలి ప్రయత్నంతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునీ హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తరహాలోనే ఈ సినిమాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని భావించాడు.

సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించగా ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. పెద్ద హీరోలు పెద్ద వారి సపోర్ట్ లేకుండా ఈ సినిమా విడుదల కాబోతుండడం విశేషం. ప్రమోషన్ కంటెంట్ తోనే చిత్రంపై మంచి అంచనాలను ఏర్పరిచారు. ఏప్రిల్ ఒకటవ తేదీన ఈ సినిమా విడుదల చేస్తూ ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను దర్శకుడు మీడియాకు వెల్లడించారు. చంటబ్బాయి తర్వాత తెలుగు తెర మీదకు రాబోతున్న డిటెక్టివ్ కామెడీ సినిమా ఇది.

తప్పకుండా ఇది ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది అన్నారు. పిల్లలతో కూడిన ఎలాంటి సినిమా కూడా లిటిల్ సోల్జర్స్ తర్వాత రాలేదు. ఆ రెండు సినిమాలను కలిపి ఇప్పటి తరానికి ఏ విధమైన వినోదాన్ని అందించలో అలాంటి చక్కని వినోదం ఈ చిత్రంలో చూడవచ్చు అని ఆయన చెబుతున్నారు. 2014లో వాస్తవ సంఘటన ఆధారంగా రాసిన ఈ సినిమా కథ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఇలాంటి కథతో రావటం రిస్క్ అనిపించలేదు. అన్నారు. ముగ్గురు పిల్లలు దావూద్ ను పట్టుకోవడం అనే పాయింట్ తో ఈ సినిమా చేశారు. ఆర్ఆర్ఆర్ వంటి పెద్ద సినిమా మేనియా లో ప్రేక్షకులు ఉన్న నేపథ్యంలో ఈ చిన్న సినిమాను ఆయన విడుదల చేయాలనుకోవడం నిజంగా రిస్క్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: