టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ దర్శకుడిగా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దర్శకులలో క్రిష్ జాగర్లమూడి ఒకరు , గమ్యం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక   ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న క్రిష్ జాగర్లమూడి ఆ తర్వాత వేదం , కంచె సినిమా లతో దర్శకుడిగా ఇటు విమర్శకుల నుండి అటు ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు,  గౌతమీపుత్ర శాతకర్ణి  సినిమాతో క్రిష్ జాగర్లమూడి మరోసారి  క్రిష్ జాగర్లమూడి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే  క్రిష్ జాగర్లమూడి  అక్కరగా కిందపొలం  సినిమాకు దర్శకత్వం వహించాడు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్  దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.  ఇది ఇలా ఉంటే క్రిష్ జాగర్లమూడి,  పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే,  ఈ సినిమా షూటింగ్ 50 శాతం వరకు పూర్తి అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది.

 ఈ సినిమా షూటింగ్ తిరిగి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది,  పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత వేరే సినిమా షూటింగ్ మొదలు పెట్టనునట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే భారీ బడ్జెట్ తో ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు,  ఈ మూవీ లో అర్జున్ రాంపాల్ .. జాక్వెలిన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.  హరిహర వీరమల్లు మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది,  ఇది ఇలా ఉంటే  ఇప్పటికే చాలా ఆలస్యమైన కారణంగా ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తరువాత నే మరో ప్రాజెక్ట్ పైకి వెళ్లాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: