
బీస్ట్ : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బీస్ట్ సినిమా ఈ నెల 13 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది, ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా, ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది, ఈ సినిమాకు అనిరుద్ సంగీతాన్ని సమకూర్చాడు.
కెజిఎఫ్ 2 : యాష్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ 2 సినిమా ఈ నెల 14 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది, కే జి ఎఫ్ చాప్టర్ 1 సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఈ వారం 'ఓ టి టి' లో సందడి చేయబోయే సినిమాలు...
ఆడవాళ్లు మీకు జోహార్లు , ఏప్రిల్ 14 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. దహనం' మూవీ ఎంఎక్స్ ప్లేయర్ లో విడుదలవుతున్నాయి. ఇదే రోజున జీ 5 'ఓ టి టి' లో గాలివాన వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. నివేదా పేతురాజ్ కీలక పాత్ర పోషించిన 'బ్లడీ మేరీ' ఆహా లో ఏప్రిల్ 15 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇలా ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతుంటే మరికొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో 'ఓ టి టి' లో సందడి చేయబోతున్నాయి.