క్యాష్ దొరికినంత దోచుకో.. ఈ బుల్లితెర కార్యక్రమం గురించి మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే ప్రస్తుతం తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ అదిరిపోయే సూపర్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న టీవీ షోలలో ఇక సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో కూడా ఒకటి.  ప్రతివారం సరికొత్త గెస్టు లతో ఇక క్యాష్ షో అందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తూ పగలబడి నవ్వుకునేలా చేస్తూ ఉంటుంది. యాంకర్ సుమ స్పాంటినియస్ పంచుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన శైలిలోకి గెస్ట్ గా వచ్చిన వారిపై పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది యాంకర్ సుమ.


 ప్రతివారం నలుగురు వ్యక్తులను షో కి పిలుస్తూ వారితో ఫన్నీ టాస్క్ లు ఆడిస్తూ క్యాష్ షో తో ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. ఈ కార్యక్రమం ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది అనే విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల క్యాష్ వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో లో భాగంగా టాలీవుడ్ స్టార్ కమెడియన్ కృష్ణభగవాన్, పోసాని కృష్ణ మురళి,  సమీర్,  హేమ లు ఎంట్రీ ఇచ్చారు. సాధారణంగా క్యాష్ షో లోకి వచ్చిన గెస్ట్ ల మీద సుమ పంచులు వేస్తూ ఉంటుంది.


 కానీ ఇటీవల విడుదలైన ప్రోమో లో మాత్రం సుమ సైలెంట్ గా ఉంటే గెస్ట్ గా వచ్చిన కృష్ణ భగవాన్ మాత్రం పంచుల వర్షం కురిపించాడు అని చెప్పాలి. ఎవరు ఏం మాట్లాడినా ఆయన కామెడీ టైమింగ్ తో పంచ్ వేసి అందరిని కడుపుబ్బ నవ్వించాడు. కృష్ణ భగవాన్ పంచులు వేస్తూ ఉంటే మిగతా ముగ్గురు కమెడియన్స్ అందరూ కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్వారు అని చెప్పాలి. కృష్ణ భగవాన్ కామెడీ టైమింగ్ చూసిన తర్వాత ఇలాంటి కమెడీయన్ కు అటు సినిమాల్లో ఎందుకు ఆఫర్లు రావడం లేదబ్బా అని అందరూ ఆలోచనలో పడిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: