స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.అయితే ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ మధ్యలో ప్రేమ, దోమ అంటూ కెరీర్ నాశనం చేసుకుంది.ఇదిలావుండగా ప్రస్తుతం  శృతి కిట్టీలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్‌లో సలార్ చిత్రం ఒకటి. అయితే ఇందులో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.అంతేకాదు ఈ సినిమాలో శృతిహాసన్ ఒక యాంగిల్ లో ట్రెడిషినల్ గా కనిపిస్తూనే మరొక యాంగిల్ లో చాలా గ్లామరస్ గా కనిపిస్తుందట.ఇకపోతే  అందుకు సంబంధించిన లుక్ ను శృతి హాసన్ ఇటీవల వీడియో తో సహా సోషల్ మీడియాలో లీక్ చేసింది.కాగా  ఆమె చాలా రఫ్ లుక్ తో కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 అయితే  గ్లామరస్ అందాలతో కూడా నెటిజన్లకు షాక్ ఇచ్చింది.ఇక అసలు విషయం ఏమిటంటే శృతి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మైఖేల్ కోర్సలేని వదిలేసిన తర్వాత ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక ప్రేమలో పడ్డారు . అయితే వీరిద్దరూ ప్రస్తుతం అక్కడ ఓకే ఇంటిలో ఉంటున్నారు. అంతేకాదు ప్రేమలు కొనసాగిస్తున్న శృతిని పెళ్లి గురించి అడిగితే కంగారు పడుతున్నారు.ఇక  ఎందుకో పెళ్లంటే నాకు ఆందోళన అంటున్నారు. కాగా పెళ్లి వద్దనుకుంటే ప్రేమలు ఎందుకు అనేది అసలు సమస్య.అయితే శృతి పేరెంట్స్ కమల్-సారిక ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయారు. ఇమ ఈ కారణం చేతనే పెళ్లి వద్దనుకుంటున్నారా? అని అడిగితే కాదని సమాధానం చెబుతున్నారు.

 అయితే అమ్మానాన్న విడాకులు తీసుకున్నప్పటికీ కలిసి ఉన్నంత కాలం సంతోషంగా ఉన్నారు.అంతేకాదు  నా భయానికి వాళ్లకు సంబంధం లేదని శృతి అంటున్నారు.అయితే  ఇద్దరు కలిసి జీవించడాన్ని అధికారికం చేయడమే పెళ్లి. అంతేకాకుండా కలిసి జీవించడానికి, పెళ్లి చేసుకోవడానికి పెద్ద తేడా లేదు. అయితే కాకపోతే పెళ్ళైతే విడిపోవాలంటే చట్టబద్ధత కావాలి. ఇక ప్రేమలు రిలేషన్స్ లో అవేమీ ఉండవు.అంతేకాదు  స్వేచ్ఛగా వద్దనుకున్నప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు అని చెప్పుకొచ్చింది.అయితే శాంతనుతో కలిసి జీవిస్తున్న శృతి అతన్ని వివాహం చేసుకుంటానని చెప్పక పోవడం విడ్డూరం.ఇకపోతే  అమ్మడు కెరీర్ కూడా ట్రాక్ లో పడింది. అయితే బడా బడా ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. కాగా ప్రభాస్ సలార్, చిరు 154, బాలయ్య 107 చిత్రాల్లో శృతి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: