మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస పెట్టి సినిమా ల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న రవితేజ ఆ  తర్వాత రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన  ఖిలాడి మూవీ లో హీరో గా నఠించాడు.

 ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేక పోయింది.  ఇలా ఖిలాడి మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి డబల్ ఇంపాక్ట్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా లో మాస్ మహారాజా రవితేజ సరసన పెళ్లి సంద D బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది . ఈ మూవీ లో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

 అసలు విషయం లోకి వెళితే ధమాకా మూవీ లో టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన  రాజ్ తరుణ్ కూడా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  ఇది ఇలా ఉంటే ఇది వరకే ధమాకా సినిమా దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా చూపిస్త మామ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించాడు. ఆ కారణం గానే ధమాకా సినిమా లోని ఒక ముఖ్యమైన పాత్రను రాజ్ తరుణ్ ఠీ నటింపజేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: