బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీలో నటించిన సినిమాల ద్వారా షారుక్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.  ఇలా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న షారుక్ ఖాన్ గత కొద్ది కాలంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు .

అలా వరుస అపజయాలు బాక్సాఫీస్ దగ్గర ఎదురవడం వల్ల షారుక్ ఖాన్ కొంతకాలం పాటు సినిమా లకు కూడా దూరంగా ఉన్నాడు. కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న షారుక్ ఖాన్ ప్రస్తుతం మాత్రం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.  అందులో భాగంగా షారుక్ ఖాన్ ప్రస్తుతం పఠాన్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను 25 జనవరి 2023 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ తో పాటు షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న డంకి సినిమాలో కూడా హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాను 22 డిసెంబర్ 2023 న విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాతో పాటు షారుక్ ఖాన్ తమిళ క్రేజీ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే సినిమాలో కూడా నటించబోతున్నాడు .  ఈ మూవీ ని 2 జూన్ 2023 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది . ఇలా షారుక్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాలు కూడా 2023 వ సంవత్సరంలో విడుదల కాబోతున్నాయి. ఇలా ఇంత కాలం సైలెంట్ గా ఉన్న షారుక్ ఖాన్ 2023 వ సంవత్సరంలో మూడు సినిమా లతో తన ఫ్యాన్స్ ను అలరించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: