హీరో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక మందన నటించిన సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే గత ఏడాది విడుదలైన చిత్రాల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల స్థాయిలో వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలోని పాటలు, డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు ఒక రేంజ్లో అలరించాయి. సోషల్ మీడియాలో కూడా పెట్టినవా బాగానే సాగింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు పలు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ చిత్రంలోని పాటలకు డైలాగులకు క్రియేట్ చేసి ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉండేవారు.


తాజాగా ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కూడా పుష్ప చిత్రంలోని పాటకు డాన్స్ వేసింది.. ఈ చిత్రంలోని బ్లాక్ బస్టర్ సాంగ్ గా నిలిచిన "సామి నా సామి" అనే పాటను రీ క్రియేట్ చేసి వీడియోను విడుదల చేసింది. ఇక రష్మిక వేసిన స్టెప్పులకు అనన్య ఎంతో అందంగా డాన్స్ వేస్తే ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతోంది. ఇక అన్నయ్య తో పాటు సారా అలీ ఖాన్ ప్రస్తుతం ఐఫా-2022 కార్యక్రమంలో అబుదాబిలో పాల్గొన్నారు.


ఈవెంట్ పూర్తయిన తర్వాత అనన్య ఒక హోటల్లో ఈ పాటకు స్టెప్పులు వేసి సిగ్నేచర్ స్టెప్ అని తెలియజేసింది. ఈ పాటను సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత రష్మీక కూడా ఈ వీడియోను రేపు పోస్ట్ చేసింది దీంతో ఈ వీడియో కాస్త నేను ఇంట్లో చాలా వైరల్ అవుతోంది. ఇక బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న అనన్య పాండే తెలుగు లో కూడా అడుగుపెట్టనుంది విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ చిత్రంలో ఈమె నటించింది. ఇక ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: