ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరోయిన్స్ ప్రతి సంవత్సరం కూడా అడుగు పెడుతూ ఉంటారు. వారిలో కొందరు మాత్రమే వారి కెరీర్ లో ముందుకు సాగుతారు. కొందరు అయితే ఒకటి రెండు సంవత్సరాల్లోనే కనిపించకుండా పోతారు.కొందరు మాత్రం దశాబ్దాల తరబడి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలిచి పోతారు.. వయసు అయిపోయినా కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమా ఇండస్ట్రీలోనే ఉంటారు. అలా నిలిచి పోయే హీరోయిన్ నివేథ పేతురాజ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.హీరోయిన్ గా నివేథా పేతురాజ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇప్పటికి ఆరు సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ ఆరు సంవత్సరాల్లో ఈ అమ్మడు ఎన్నో వైవిధ్యభరిత సినిమాలను చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగు లో కూడా పలు సినిమాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ అక్కడ ఇక్కడ మంచి స్టార్ డమ్ ను దక్కించుకుని మరీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో కాకున్న మీడియం రేంజ్ లో దూసుకు పోతుంది.తమిళంలో ఈమె మొదటి సినిమా ఒరు నాల్ కూతు 2016  వ సంవత్సరంలో విడుదల అయ్యింది. మొదటి సినిమా తోనే మంచి నటిగా అక్కడి ప్రేక్షకులను అలరించడంతో పాటు మంచి అందంతో ఆకట్టుకుంది.


 స్కిన్ షో విషయంలో మొదట్లో ఆసక్తి చూపించని ఈ అమ్మడు ఈమద్య కాలంలో అయితే అసలు అందాల ఆరబోతను కూడా ఓ మోస్తరుగా చేస్తూ ఆకట్టుకుంటుంది.తెలుగులో 2017 వ సంవత్సరంలో మెంటల్ మదిలో సినిమా తో ఈమె ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా నుండి ఇప్పటి వరకు కూడా వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చింది. ఇటీవల విరాటపర్వం సినిమాలో కూడా నటించిన ఈ అమ్మడు మరిన్ని సినిమాల్లో కూడా నటించబోతుంది. ఆ సినిమాలకు సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే వెలువడబోతుంది. అలాగే ఈమె అల వైకుంఠపురంలో నటించి తెలుగు లో మరింతగా పాపులర్ అయ్యింది.విరాటపర్వంతో తెలుగు లో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారే అవకాశం కూడా ఉంది. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తు ఈ అమ్మడు అన్ని ప్లాట్ ఫామ్స్ పై ఆకట్టుకుంటూ దూసుకుపోతూ ఉంది. తెలుగు లో ఈ అమ్మడికి అయితే మంచి భవిష్యత్తు ఉంది. ఇక ఆరు ఏళ్లు ఇండస్ట్రీలో సక్సెస్ లను దక్కించుకున్న ఈ అమ్మడు రాబోయే పదేళ్ల పాటు మరింతగా సక్సెస్ లు ఈమెకు దక్కుతాయని ఈమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: