కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన తలపతి విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ దర్శకుల్లో ఒకరు అయిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తళపతి విజయ్ కి 66 వ సినిమా. ఇప్పటి వరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. 

ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించి తెలుగు లో డబ్ చేసి విడుదల చేయనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో విజయ్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో  విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇది కల ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ లోని కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి లీక్ అయిన ఫోటోలు నెట్టింట్లో  వైరల్ అవుతున్నాయి.  రోడ్డు పక్కన నర్సరీ సెట్ లో జరుగుతున్న షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలలో  విజయ్, రష్మిక మందన కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. 

ఇలా షూటింగ్ స్పాట్ నుండి ఫోటోలు లీక్ అవ్వడం పై దర్శకుడు వంశీ పైడిపల్లి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై షూటింగ్ స్పాట్ లో కి ఎవరిని సెల్ ఫోన్ లతో అనుమతించకూడదు అని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ కి దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: