యస్ యస్ రాజమౌళి మహేష్ తో తీసే సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా మహేష్ కి ఉన్న బ్రాండ్ ఇమేజ్.. క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని తీయాల్సిన పెద్ద సినిమా. పైగా ఆఫ్రియన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ ఇది.ఇక సెట్స్ నిర్మాణం గానీ..రియల్ లోకేషన్ లో షూటింగ్ గానీ ప్రతీది కూడా ఎంతో వాస్తవికంగా ఇంకా విజువల్ గా హైలైట్ చేయాల్సి ఉంటుంది. ఇక రాజమౌళి సినిమా అంటే ఎలాగూ విదేశీ సాంకేతిక నిపుణులు తప్పనిసరిగా పని చేస్తారు.సీజీ వర్క్ అంతా కూడా ప్రఖ్యాత కార్పోరేట్ కంపెనీలకే అప్పగించాల్సి ఉంటుంది. భారీ కాన్వాస్ అనేవి తప్పనిసరి. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న పాన్ ఇండియా చిత్రానికి రాజమౌళి కేటాయించే బడ్జెట్ ఎంత అంటే? అక్షరాల 500 నుంచి 600 కోట్ల మధ్యలో ఉంటుందనే ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటికే నిర్మాతగా కే.ఎల్ నారాయాణ ఖరారు అయ్యారు.అయితే ఇంత బడ్జెట్ ఆయనొక్కరే పెడుతున్నారా? లేదా భాగస్వాముల్ని రంగంలోకి దించుతారా? అంటే అందుకు కూడా ఛాన్స్ ఉందని వినిపిస్తుంది. ఒకటి రెండు ఫస్ట్ క్లాస్ నిర్మాణ సంస్థల్ని రంగంలోకి దించాలని యస్ యస్ రాజమౌళి భావిస్తున్నారుట. ఇక 'లైకా ప్రొడక్షన్స్' తరహాలో నిర్మాణం మధ్యలో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా భాగస్వాముల్ని కూడా ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుందని రాజమౌళి ఆలోచనగా కనిపిస్తుంది.సెట్స్ కి వెళ్లిన తర్వాత సినిమా నిర్మాణం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇలా కొన్ని లెక్కలు బేరీజు వేసుకుని సీన్ లోకి కొత్త నిర్మాణ సంస్థల్ని తెచ్చే ఆలోచనగా ఇప్పుడు కనిపిస్తుంది.


మరి ఈ ప్రాజెక్ట్ లో సూపర్ స్టార్ మహేష్ పెట్టుబడి ఉంటుందా? అన్నది ఇప్పుడు ఓ మిస్టరీగా కనిపిస్తుంది. మహేష్ బాబు ప్రతీ సినిమాలో వాటా తీసుకుంటారు. ఇక ఆయన రెమ్యునరనేషన్ నే పెట్టుబడిగా పెట్టి..జీఎంబీ బ్యానర్ ని టైటిల్ కార్స్డ్ లో నిర్మాణ సంస్థగా వేస్తు ఆయన వచ్చారు.మరి ఇప్పుడు యస్ యస్ రాజమౌళి సినిమా విషయంలో ఎలాంటి అగ్రిమెంట్ తో ముందుకు వెళ్తారు? అన్నది ఇక కీలకంగా మారింది. ఇక రాజమౌళి సినిమా అంటే కర్త..కర్మ..క్రియ అన్ని కూడా ఆయనే అవుతారు. ప్రతీ పనిలోనూ ఆయన భాగస్వామ్యం అనేది ఉంటుంది. ఇక నిర్మాత పెట్టిన పెట్టుబడి కంటే డబుల్ ప్రాపిట్ ఆయన ఖాతాలో చేరుతుంది.ప్రాజెక్ట్ ముందే ఆ రకమైన అగ్రిమెంట్ కూడా కుదురుతుంది. వసూళ్లలో వాటాకి హీరోకి ఛాన్స్ అనేది ఉండదు. కానీ అక్కడ వుంది సూపర్ స్టార్ మహేష్ కాబట్టి మహేష్ విషయంలో ఏదైనా వెసులు బాటు ఉంటుందా? మహేష్ కూడా జక్కన్న నిబంధనలే అనుసరించాల్సి ఉంటుందా? అన్నది మున్ముందు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: