మణిరత్నం సినిమా అంటే చాలామంది అభిమానులు ఆ చిత్రాన్ని తొలి రోజున చూడడానికి ఎంతగానో ఆసక్తి చూపించేవారు. ఆయన సినిమాలకు క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపిస్తూ ఆయన యొక్క గొప్ప టాలెంట్ ను పొగుడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం లెక్క మారింది. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపరచడంతో ఈ దర్శకుడి సినిమాలకు క్రేజ్ లేకుండా పోయింది. ఎంతటి మంచి కళాఖండాన్ని తెరపై చేసినా కూడా ఆ సినిమా వారి ప్రశంసలను అందుకోకపోవడంతో మణిరత్నం సినిమాకు ఆసక్తి తగ్గుతుందని చెప్పవచ్చు.

ఆ విధంగా ఇప్పుడు ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న  పొన్నియన్ సెల్వన్ సినిమాపై ఏమాత్రం బజ్ లేకపోవడం ఆయన అభిమానులను కలవరపరుస్తుంది. 9వ శతాబ్దం నాటి చోళ రాజుల సామ్రాజ్యం నేపథ్యంలో ఈ పిరియాడికల్ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. క్రేజీ నటులు విక్రమ్ ఐశ్వర్యారాయ్ కార్తీ జయం రవి త్రిష శరత్ కుమార్ ప్రకాష్ రాజ్ శోభిత ధూళిపాల వంటి స్టార్ లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను మద్రాస్ టాకీస్ వారితో కలిసి లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.

సినిమా కోసం దాదాపు 500 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నారట యూనిట్. బాహుబలి స్ఫూర్తితో రూపొందుతున్న ఈ మూవీ తప్పకుండా భారీ బజ్ ను రాబట్టుకుంటుంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీన ఐదు భాషలలో విడుదల కావడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా తక్కువగా బజ్ ఉండడం అందరినీ కలవరపరుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా యొక్క ప్రచార కార్యక్రమానికి మేకర్స్ తెర లేపారు. మరి ఇప్పటినుంచైనా ఈ సినిమాకు ప్రచారాన్ని గట్టిగా చేసి అందరిలో మంచి క్రేజ్ ఏర్పడేలా చిత్ర బృందం చేస్తుందా అనేది చూడాలి. తెలుగు నాట ఈ సినిమాకు ఏమాత్రం బజ్ లేకపోవడం ఆ చిత్రం యొక్క కలెక్షన్లు తక్కువ అయ్యేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా రిలీజ్ వరకు ఏదో ఒక రకంగా ఈ సినిమాపై అంచనాలను పెంచాలని తెలుగు మణిరత్నం అభిమానులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

PSI