టాలీవుడ్ హీరో వెంకటేష్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తెలుసు. ఇక ఆయన ఎంతగా మొహమాటపడతాడో అలాగే ఆయన ఎంతగా లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు అనే విషయం ప్రతి ఒక్క అభిమానికి సుపరిచితమే.ఇదిలావుంటే తాజాగా నటుడు మురళీమోహన్ ఒక మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వెంకటేష్ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. ఇక వెంకటేష్ మొహమాటం గురించి ఆయన అభిమానులతో ముచ్చటించారు. అంతేకాదు మా అసోసియేషన్ మొదలైనప్పటి నుంచి అధ్యక్షుని స్థానంలో కేవలం హీరోలనే ఉంచాలని మొదట్లో అంతా భావించారట.

ఇక  ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ పని జరగాలన్నా కూడా కమెడియన్స్ కానీ, క్యారెక్టర్స్ ఆర్టిస్ట్లు కానీ లేదా చిన్నచిన్న వేషాలు వేసుకునే నటులు చేస్తే ఆ పనులు జరగమని హీరోలైతే తొందరగా చక్కబడతాయని ఒక బలమైన నమ్మకం ఉండేది. అయితే అదే నిజం కూడా, ఎందుకంటే హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అలాగే అందరూ ఆయన మాట వినడానికి ఇష్టపడతారు.  ఒక చిన్న నటుడు చెబితే పెద్ద హీరోలు వింటారా ? అందుకే హీరోలు మాత్రమే మా అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉండాలనేది తొలుత కొన్నేళ్ల పాటు కొనసాగింది.అయితే  చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు సహా చాలామంది నటులు మా అసోసియేషన్ కి అధ్యక్ష పదవిని చేపట్టారు.

ఒక టర్మ్ లో హీరో వెంకటేష్ ని మా అధ్యక్ష పదవిని చేపట్టమని అడగగా ఆయన సున్నితంగా తిరస్కరించారట.ఇకపోతే మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ వెళ్లి కూడా ఆయనని ఎంతో బ్రతిమాలిన కూడా నాకు బయట విషయాలు పెద్దగా తెలియదండి.ఇక  నా పని ఏంటో అదే చూసుకుంటాను నాకు తెలియని వాటిల్లో వేలు పెట్టలేను అంటూ మా అసోసియేషన్ పదవికి తాను సరిపోనంటూ చెప్పాడట.ఇక  మురళీ మోహన్ మరి బలవంతం చేయడంతో ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా ఉండడానికి ఒప్పుకున్నారట. అయితే అలా ఒకసారి ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా పనిచేసిన కూడా ఇప్పటివరకు ఆయన అధ్యక్ష పదవిని చేపట్టలేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: