ఇక అమ్మాయిలే ఎక్స్ పోజింగ్ చేయాలా మాకేం తక్కువ అన్నట్టు హీరోలు నగ్నంగానో లేదంటే అర్ధనగ్నంగానో రచ్చ చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.ఇక ఫీమేల్ యాక్టర్స్ సెమీ న్యూడ్ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టడం అనేది దాదాపు సర్వసాధారణం. కానీ, మేల్ యాక్టర్స్ చిత్రాలు కూడా ఇప్పుడు వాటిని డామినేట్ చేస్తున్నాయి. ఇటీవలే లైగర్ చిత్రానికి చెందిన ఓ ఫొటోలో లీడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ న్యూడ్‌గా ఫోజు ఇచ్చి షాక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్ న్యూడ్‌గా ఫోజులు ఇచ్చాడు. ఆ ఫొటోలు దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత వరసలో కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కూడా చేరాడు. మన హైదరాబాదీ, బ్యాండ్మెంటన్ ప్లేయర్ అయిన గుత్తా జ్వాలను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్న విష్ణు విశాల్ న్యూడ్ పిక్స్ షేర్ చేసి అందరికి కూడా పెద్ద షాక్ ఇచ్చాడు.ఇక వీటిపైనే నానా రచ్చ సాగుతున్న సమయంలో టాలీవుడ్ సింగర్ గీతా మాధురి భర్త, ఇంకా నటుడు నందు కూడా ఇందులో చేరినట్టు తెలుస్తుంది.
నందు మరీ వారంతా కాకపోయిన కాస్త ఎక్స్ పోజింగ్ చేస్తూ ఔరా అనిపించాడు.ఇక టవల్ కట్టుకుని నిలబడ్డ నందు… తన సిక్స్ ప్యాక్‌ను అందరికీ చూపిస్తున్నట్టుగా అనిపించింది. మొత్తానికి నందు మాత్రం నెట్టింట్లో ఈ ఫోటో షూట్‌తో బాగా ట్రెండ్ అవుతున్నాడు. ఇతను రణ్‌వీర్ ఇంకా విష్ణు విశాల్‌ని ఆదర్శంగా తీసుకొని ఇలా ఫొటొ షూట్ చేశాడా, లేక క్యాజువల్‌గా చేశాడో తెలియదు కాని నందు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాడు. మనోడు సినిమాలు లేకపోయిన అప్పుడప్పుడు ఇలాంటి విషయాలతో బాగానే వార్తలలో నిలుస్తుంటాడు. చివరిగా రష్మీ గౌతమ్‌తో కలిసి బొమ్మబ్లాక్ బస్టర్ అనే సినిమాలో నందు నటించాడు. కానీ ఈ చిత్రం అప్డేట్ మాత్రం ఇంత వరకు కూడా రాలేదు. కరోనా కంటే ముందు ఈ సినిమాను భారీ ఎత్తన ప్రమోట్ చేశారు. ఇంత వరకు కూడా ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి న్యూస్ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: