ఇటీవలి కాలంలో డబల్ మీనింగ్ డైలాగులదే బుల్లితెరపై ఎక్కువగా హవా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ టీవీలో ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలలో డబల్ మీనింగ్ డైలాగులతో ప్రేక్షకులను నవ్వించడానికి ప్రయత్నిస్తున్నారు కమెడియన్స్. ఇక ఇలా డబల్ మీనింగ్ డైలాగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన షో జబర్దస్త్. మొన్నటి వరకు  జబర్దస్త్ లో మాత్రమే ఇలాంటి బూతు డైలాగులు కనిపించేవి. కానీ ఇటీవల కాలంలో మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే కొన్ని కొన్ని సార్లు కమెడియన్స్ వేసే డబల్ మీనింగ్ డైలాగ్స్ కి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఆ షోలో జడ్జిగా ఉన్న వారు సిగ్గుతో తలదించుకోవటం చేస్తూ ఉంటారు.


 అయితే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో నా కొడుకు అంటూ ఒక ప్రత్యేకమైన ఈవెంట్ చేశారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈవెంట్కి కృష్ణ భగవాన్ గెస్ట్ గా వచ్చాడు. తప్పి పోయిన తన కొడుకుని తిరిగి పట్టుకుని థిమ్ లో నానా హంగామా చేశారు అందరు. తన కొడుకుకి పచ్చిమిర్చి తినే అలవాటు ఉందని చెప్పడంతో అందరూ పచ్చిమిర్చి తిన్నారు. ఈ క్రమంలోనే మరో స్కిట్ లో భాగంగా ఆటో రాంప్రసాద్ కూరగాయలు అమ్మే వ్యక్తి గా చేస్తూ ఉంటే.. ఇక వాటిని కొనే కస్టమర్ గా చేస్తాడు జబర్దస్త్ నరేష్.



 ఈ క్రమంలోనే నరేష్ తన పరువు తానే తీసుకున్నాడు అని చెప్పాలి. దొండకాయ ఏంటి ఇంతే ఉంది అంటూ డబల్ మీనింగ్ లో అంటాడు జబర్దస్త్ నరేష్. దీంతో ఇక ఈ బూతు పంచ్ కు జడ్జిగా ఉన్న ఇంద్రజ తలదించుకుంది. అయితే అక్కడితో రాంప్రసాద్ ఆగకుండా ఎక్కడో చూసినట్టుగా ఉంది కదా అంటూ ఇంకా రెచ్చిపోతాడు. అయితే ఈ బూతు పంచ్ లను చూస్తూ అక్కడి వారంతా కూడా పగలబడి నవ్వుకుంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాత్రం ప్రేక్షకులకు అసలు నచ్చడం లేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: