సినిమా రంగంలో ఎందరో నటులు ప్రస్తుతం ప్రేక్షకుల మనసును ఆకట్టుకుంటున్నా... కొద్ది మంది నటులు మాత్రం తమదైన విలక్షణ నటనతో అలా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు. అటువంటి నటులలో ఒకరే చియాన్ విక్రమ్. ఇతను నటించిన ఏ సినిమాను అయినా ఫలితంతో సంబంధం లేకుండా తన నటన కోసం ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. కొందరు ప్రేక్షకులు అయితే ఎప్పుడెప్పుడు విక్రమ్ సినిమా వస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇతను నటించిన సినిమాలలో అపరిచితుడు మరియు ఐ సినిమాలు నచ్చని ప్రేక్షకుడు ఉండరు.

ఈ మధ్యన చూసుకుంటే సినిమాల మధ్య అంతరం బాగా పెరిగిపోయింది అని చెప్పాలి. దీనికి వయసు కూడా ఒక కారణం అని తెలుస్తోంది. కాగా రీసెంటుగా విక్రమ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'కోబ్రా' మూవీ ఇంకో వారం రోజుల్లో థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విక్రమ్ ఒక ఆర్ధిక నేరగాడిగా నటిస్తున్నట్లు నిన్న రిలీజ్ అయిన టీజర్ ను బట్టి తెలుస్తోంది. ఇక అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ నటన మరియు గెట్ అప్ లు ఇందులో ఆశించవచ్చని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ ను సరికొత్తగా మలచడంలో డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. ఒక లెక్కల మాస్టారూ ఎటువంటి పరిస్థితుల్లో ఆర్ధిక నేరగాడిగా మారాడు అన్న కథాంశం ఇంట్రస్ట్ ను రేకెత్తిస్తోంది. ఇది ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ గా ఉండనుంది. ఇక ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ఈ సినిమాలో కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఇందులో ప్రత్యేక ఆకర్షణ అంటే ప్రముఖ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మొదటి సారి నటుడిగా మారి ఒక ఇన్వెస్టిగేషన్ అధికారిగా నటించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: