బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో పెద్ద దూమారం రేపిన సంగతి తెలిసిందే. కొందరు ఇది సపోర్ట్ చేస్తే చాలా మంది కూడా వ్యతిరేకించి విమర్శలు గుప్పించారు. ఫేమస్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కోసం తన న్యూడ్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో హంగామా సృష్టించాడు.దీనిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర మహిళా కమిషన్ ముంబైలోని చెంబూర్ పోలీస్ స్టేషన్ లోను అతనిపై ఫిర్యాదు చేసింది.రణవీర్ ఆగష్టు 22న విచారణ కోసం హాజరు కావాల్సి ఉండగా.. దాని కోసం మరో రెండు వారాలు ఆగాలని పోలీసులను అభ్యర్థించాడు. తాజా సమాచారం మేరకు.. సోమవారం రణవీర్ ని పోలీసుల ఎదుట హాజరుపరిచి 2 గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారం.సోమవారం ఉదయం 7 గంటలకు ముంబై పోలీసుల ఎదుట హాజరైన ఆయనను అధికారులు ప్రశ్నించారు. వివాదాస్పద ఫోటోలను తాను అప్ లోడ్ చేయలేదని.. ఆ ఫోటోలు తనకు ఇబ్బందిని సృష్టిస్తాయని తనకు తెలియదని అతడు చెప్పాడు. ముంబయి పోలీసులు అతడిని మళ్లీ విచారణ కోసం పిలుస్తారని సమాచారం తెలుస్తుంది.


రణవీర్ సింగ్ సాధారణంగా మహిళల మనోభావాలను దెబ్బతీశాడని .. తన ఫోటోల ద్వారా వారిని కించపరచడమే గాక.. అవమానించాడని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు. 292- అశ్లీల పుస్తకాల అమ్మకం మొదలైనవి.. 293- యువకులకు అసభ్యకరమైన వస్తువులను విక్రయించడం.. 509- మహిళ యొక్క అణకువను అవమానించేలా ఉద్దేశించిన పదం.. సంజ్ఞ లేదా చర్య వంటి అనేక భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. IT చట్టంలోని సెక్షన్ 67Aతో పాటుగా భారతీయ శిక్షాస్మృతి (IPC) ప్రకారం స్త్రీలను కించపరిచే చర్యకు అతడు శిక్షార్హుడు అని కూడా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది.రణవీర్ సింగ్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదయ్యాక.. దీనిపై ముంబై పోలీసుల బృందం నోటీసులు అందించడానికి ముందు రోజు రణవీర్ నివాసాన్ని విజిట్ చేశారు. అయితే పోలీసులు వచ్చేసరికి రణ్ వీర్ ఇంట్లో లేరని తెలిసింది. ఆ తర్వాత ఆగస్టు 22న తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు నోటీసులు పంపారు. ఎట్టకేలకు రణవీర్ సింగ్ పోలీసుల ఎదుట హాజరవ్వగా తదుపరి విచారణకు కూడా రణవీర్ హాజరు కావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: