ఈ ఏడాది ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సైమా అవార్డ్స్ వేడుక జరిగింది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా అత్యత్తమ సినిమాలకు అవార్డ్స్ దక్కాయి. అలా అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమా కు ఈసారి అవార్డు ల పంట పండింది. ఈ సినిమా విడుదల అయినప్పుడు బాక్సాఫీసు వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది అంటే సినిమా లో దమ్ము ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలా బన్నీ హవాను దేశవ్యాప్తంగా చాటిన చిత్రం పుష్ప.

అయితే ఈ సినిమా విడుదల అయినప్పుడే తప్పకుండా ఈ సినిమా కు అవార్డులు వస్తాయని అందరు భావించారు. అందుకే సైమా వేడుకలోనూ 'పుష్ప' తగ్గేదేలే అంటూ అవార్డులు కొల్లగొట్టింది. ఉత్తమ చిత్రం కేటగిరీ లో ఉత్తమ నటుడు కేటగిరీ లో ఉత్తమ దర్శకుడు కేటగిరీ లో ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరీ లో ఉత్తమ లిరిక్ రైటర్ కేటగిరీ లో ఉత్తమ సహాయనటుడు కేటగిరీ లో ఇలా అవార్డుల మోత మోగించి ఈ సినిమా ఎంతో స్పెషాలిటీ ని సంతరించుకుంది.  సైమాలో మొత్తం 12 కేటగిరీల్లో పోటీపడిన పుష్ప 6 అవార్డులు సొంతం చేసుకుంది.

అయితే దీనికి మించేలా విజయ్ దేవరకొండ సెంటర్ అఫ్ అట్రాక్షన్ అయ్యాడు ఈ వేడుక లో. సైమా యూత్ ఐకాన్ అఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ నేపథ్యంలో ఈ వేడుక కు హాజరయ్యిన ఈ హీరో తో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ డాన్స్ లు వేయడం నిజంగా అద్నరిని ఎంతో ఆశ్చర్యంతో పాటు చిందులేసేలా చేస్తుంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. అభిమానులు అయితే ఇది గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఇతర అవార్డుల కంటే ఎక్కువగా ఈ అవార్డు ను అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక అయన హీరో గా చేసిన లీగర్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచిందని. త్వరలోనే ఖుషి సినిమా  తో అయన ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: