బాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ తాజాగా బ్రహ్మాస్త్రం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆలియా భట్ , రన్బీర్ కపూర్ సరసన హీరోయిన్ గా నటించగా అయాన్ ముఖర్జీ మూవీ కి దర్శకత్వం వహించాడు. అమితా బచ్చన్ , నాగార్జున , మౌని రాయ్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది.

మూవీ హిందీ తో పాటు తెలుగు లో కూడా సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల అయ్యింది.  ఇది ఇలా ఉంటే బ్రహ్మాస్త్రం మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమాను తెలుగు లో రాజమౌళి సమర్పించడం ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ మూవీ ఇప్పటి వరకు 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ చేసుకున్న మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
 
మొదటి రోజు బ్రహ్మాస్త్రం మూవీ రెండు తెలుగు రాష్టాల్లో 3.68 కోట్ల కలెక్షన్ లను సాధించింది.
2 వ రోజు బ్రహ్మాస్త్రం మూవీ రెండు తెలుగు రాష్టాల్లో 2.62 కోట్ల కలెక్షన్ లను సాధించింది.
3 వ రోజు బ్రహ్మాస్త్రం మూవీ రెండు తెలుగు రాష్టాల్లో 2.19 కోట్ల కలెక్షన్ లను సాధించింది.
4 వ రోజు బ్రహ్మాస్త్రం మూవీ రెండు తెలుగు రాష్టాల్లో 1.12 కోట్ల కలెక్షన్ లను సాధించింది.
5 వ రోజు బ్రహ్మాస్త్రం రెండు తెలుగు రాష్టాల్లో మూవీ 72 లక్షల కలెక్షన్ లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: