మెగా హీరోలలో ఒకరైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించి ఈ ఏడాది విడుదలైన సినిమాలలో గని సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంటే ఎఫ్3 సినిమా ఫ్లాప్ గా నిలిచింది.ఎన్నో అంచనాలతో దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి తీసిన ఎఫ్3 సినిమా ఫ్లాప్ అవ్వడంతో వరుణ్ తేజ్ తన తరువాత సినిమాలతో తానేంటో మరోసారి రుజువు చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఆ క్రమంలో వరుణ్ తేజ్ టాలెంటెడ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం తెలుస్తుంది.సంకల్ప్ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రానా హీరోగా ఘాజీ సినిమాను తెరకెక్కించి ఆ సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో సంకల్ప్ రెడ్డి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ తో అంతరిక్షం 9000 kmph సినిమాను తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డికి ఈ సినిమాతో భారీ షాక్ తగిలింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అర్ధం కాక ఫ్లాప్ అయింది.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కమర్షియల్ గా కూడా ఫెయిలైంది.


సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సంకల్ప్ రెడ్డికి వరుణ్ తేజ్ మరో ఛాన్స్ ఇస్తున్నారని బోగట్టా. ఈ నెల 19వ తేదీన ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఖాతాలో సక్సెస్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా భిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుణ్ తేజ్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.ఫైటర్ జెట్ నడిపే పైలట్ పాత్రలో వరుణ్ తేజ్ ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వరుణ్ తేజ్ ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరుణ్ తేజ్ ను నమ్మి భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు సైతం సిద్ధంగానే ఉన్నారు. వరుణ్ తేజ్ తర్వాత సినిమా ఇక ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: