నందమూరి నటసింహం బాల కృష్ణ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే ఎన్నో హిట్ ,  సూపర్ హిట్ ,  బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీ రో లలో ఒకరిగా కొనసాగుతున్న బాలకృష్ణ కెరియర్ లో అద్భుత మైన విజయవంత మైన మూవీ లలో సమర సింహా రెడ్డి మూవీ ఒకటి. సమర సింహా రెడ్డి మూవీ అప్పట్లో బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది .

అలాగే ఈ మూవీ లో బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్ లు , మాస్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రుత లుగించాయి  .  బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సమర సింహా రెడ్డి సినిమా 13 జనవరి 1999 వ సంవత్సరంలో విడుదల అయ్యింది . ఫ్యాక్షన్ నేపథ్యం  లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి విజయేంద్రప్రసాద్ కథను అందించాడు. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన సిమ్రాన్ ,  అంజలి  జావేరి ,  సంఘవి హీరోయిన్ లుగా నటించగా మణిశర్మమూవీ కి సంగీతాన్ని అందించాడు.

మూవీ విజయంలో మణిశర్మ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ఇలా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ మూవీ ని తిరిగి మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. సమర సింహా రెడ్డి 4 కే వర్షన్ మూవీ ని అక్టోబర్ 1 వ తేదీన మళ్లీ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మరి కొన్ని రోజుల్లోనే వెలువడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: