టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున హీరోగా మరో ఆరు రోజుల్లో థియేటర్లలో ది ఘోస్ట్ మూవీ రిలీజ్ కానుంది. స్టార్ హీరో నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో కచ్చితంగా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటాడని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.పరిమిత బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కిందని నాగార్జున రెమ్యునరేషన్ కు బదులుగా నాలుగు ఏరియాల హక్కులను తీసుకున్నారని సమాచారం. వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు ఏరియాలలో ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై పంపిణీ కానుందని తెలుస్తోంది.ది ఘోస్ట్ సినిమా రిజల్ట్ పై నాగార్జునకు కాన్ఫిడెన్స్ ఉండటం వల్లే ఆయన ఈ విధంగా చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. హిందీలో కూడా నాగార్జున తన సొంత ఖర్చులతో ఈ సినిమాను రిలీజ్ చేయిస్తున్నారు. హిందీలో ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని నాగ్ అనుకుంటున్నారు. హిందీ ప్రేక్షకులకు నచ్చే సబ్జెక్ట్ తో ది ఘోస్ట్ తెరకెక్కడంతో నాగార్జున ఈ విధంగా చేస్తున్నారని తెలుస్తోంది.పైగా ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా చాలా బాగుందనే సమాచారం కూడా తెలుస్తుంది.


ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. నాన్ థియేట్రికల్ హక్కులతో ఈ సినిమా బడ్జెట్ రికవరీ కావడంతో నైజాం, సీడెడ్ లో ది ఘోస్ట్ సాధించే కలెక్షన్లు నిర్మాతలకు లాభంగా మిగిలే ఛాన్స్ ఉంది. ఏపీలోని ఏరియాల ద్వారా వచ్చే మొత్తం నాగ్ రెమ్యునరేషన్ కానుంది. ది ఘోస్ట్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుంది.గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలు ఒకేరోజు థియేటర్లలో విడుదలవుతుండగా 60 శాతం మంది ప్రేక్షకులు గాడ్ ఫాదర్ పై ఆసక్తి చూపిస్తుంటే 40 శాతం మంది ప్రేక్షకులు ది ఘోస్ట్ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నట్టు పలు పోల్స్ ద్వారా వెల్లడైంది. గాడ్ ఫాదర్ రీమేక్ కావడం ఆ సినిమాకు మైనస్ కాగా ది ఘోస్ట్ స్ట్రెయిట్ సినిమా కావడం ఈ సినిమాకు ప్లస్. చూడాలి ఏ సినిమా అల్లరిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: