తెలుగు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. ఆయన రేంజ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాకింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు డార్లింగ్. ఇదే కాదు గతంలో వచ్చిన సినిమాలు కూడా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. ప్రభాస్ లుక్స్.. రాజసం.. నటన చూసి ఫిదా అయ్యారు. ఈ సినిమాతో డార్లింగ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు చేతినిండా భారీ బడ్జెట్ చిత్రాల తో ఫుల్ బిజీ అయ్యారు. టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్స్ యంగ్ రెబల్ స్టార్ తో లు చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.


ఇక అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ప్రభాస్ ల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ మూవీ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఆదివారం సాయంత్రం ఫుల్ విజువల్ వండర్ ఇచ్చేశారు డైరెక్టర్ ఓంరౌత్. కాసేపటి క్రితం విడుదలైన ఆదిపురుష్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ ను తెలుగుతోపాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ లోనూ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ హిందీలో తన పాత్రకు ప్రభాస్ డబ్బింగ్ చెప్పలేదు. నటుడు శరద్ కేల్కర్ ఆదిపురుష్ లో ప్రబాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు.


 గతంలో బాహుబలి చిత్రం సమయంలోనూ డార్లింగ్ పాత్రకు ఆయనే వాయిస్ ఓవర్ అందించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రాబోతున్న ఈ మూవీ లో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ను అక్టోబర్ 2న అయోధ్య వేదికగా విడుదల చేశారు. మొత్తం ఓ మాయ ప్రపంచంలాగా వుంది..దీనికి జనాల నుంచి మంచి స్పందన వస్తుంది.. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: