భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీసన్ 6 ప్రారంభం లో కాస్త మిశ్రమ స్పందన ని దక్కించుకున్నప్పటికీ ఈమధ్య ఆసక్తికరమైన టాస్కులతో ఆడియన్స్ లో ఆసక్తి సృష్టిస్తూ మంచి TRP రేటింగ్స్ తో ముందుకి దూసుకుపోతుంది..ఈసారి గత సీసన్ లో లాగ మితిమీరిన గొడవలు, లవ్ ట్రాక్ లు లేకుండా ఎంటర్టైన్మెంట్ నే ప్రధానమైన అస్త్రం గా తీసుకొని ముందుకు దూసుకుపోతుంది..ఇక ఈ వారం నామినేషన్స్ కూడా వాడివేడిగా సాగకుండా చాలా కూల్ గా సాగింది..గత వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఆరోహి ఎలిమినేట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి ఫైమా, అర్జున్ , ఆదిత్య, వాసంతి , చంటి, ఆది రెడ్డి ,మెరీనా మరియు ఇనాయ నామినేట్ అయ్యారు..వీరిలో ఈసారి ఎవరి ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది చెప్పడం కాస్త కష్టం అవుతుంది..ఎందుకంటే డేంజర్ జోన్ లో ఉన్న ఇద్దరు ఇంటి సభ్యుల మధ్య చాలా స్వల్ప ఓట్ల తేడానే ఉంది.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వారం నామినేషన్స్ ఆదిత్య మరియు వాసంతి డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది..వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు..కానీ ఎవ్వరు ఎలిమినేట్ అవుతారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది..ఒక రోజు వాసంతి లీడింగ్ లోకి వస్తే, మరో రోజు ఆదిత్య లీడింగ్ లోకి వస్తున్నాడు..ఆదిత్య బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తాడని అందరూ అనుకున్నారు.
కానీ ఆయన ఇప్పటి వరుకు తన ఆటనే మొదలు పెట్టలేదు..దానితో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పాతాళ లోకంలోకి పడిపోయింది..ఈరోజు డేంజర్ జోన్ లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది..రాబొయ్యే రోజుల్లో అయినా ఆయన తన ఆట ని మొదలు పెట్టి తన గ్రాఫ్ ని పెంచుకుంటాడో లేదో చూడాలి..ప్రస్తుతానికి అయితే ఈ వారం డేంజర్ జోన్ ఎలిమినేట్ వీళ్లిద్దరి లో ఎవరు అవ్వబోతున్నారు అనేది ఆసక్తి కరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: