అక్కినేని నాగార్జున వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఈ వయసులో కూడా ఇలా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఒకవైపు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూనే మరో వైపు సోలో హీరోగా కూడా రాణించాలి అని చూస్తున్నాడు.
ఈ మధ్యే ఆయన నటించిన బంగార్రాజు సినిమాతో మరొక హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర లో కొద్దిసేపు కనిపించి మెరిపించాడు. ఇందులో కూడా ఈయన నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఇక ఇప్పుడు నాగ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ''ది గోస్ట్'' సినిమా ఈ రోజు దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా కోసం గత కొన్ని రోజులుగా నాగ్ వరుస ప్రొమోషన్స్ చేసాడు. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత యావరేజ్ టాక్ వచ్చింది.. అలాగే ఓపెనింగ్స్ కూడా దారుణంగా రావడంతో ఈ సినిమా పరిస్థితి దారుణంగా మారిపోయింది.

ఇక్కడే కాదు రిలీజ్ అయినా ప్రతీ చోట ఇదే పరిస్థితి ఏర్పడడంతో ఘోస్ట్ సినిమా కలెక్షన్స్ ఘోరంగా వస్తున్నాయి.. మొదటి రోజే కాదు రెండవ రోజు కూడా ఇదే పరిస్థితి ఉంది.. దసరా వంటి పండుగ రోజుల్లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా రావడంతో నాగార్జునపై ట్రోల్స్ వస్తున్నాయి.. నాగార్జున ఒకప్పుడు రిజల్ట్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ రాబట్టాడు.. అయితే ఈ మధ్య కాలంలో ఈయన పెద్దగా ప్రభావం చూపించలేక పోతున్నారు..

ప్లాప్స్ సినిమాలకే కాదు.. హిట్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా ఓపెనింగ్స్ మాత్రమే కాదు కలెక్షన్స్ కూడా రాకపోవడం గమనార్హం.. బంగార్రాజు బాగానే రాబట్టిన ఇది కొడుకు కూడా ఉండడం వల్ల అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో పాటే వచ్చిన చిరు గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టింది.. ఇక బాలయ్య కూడా అఖండ తో సూపర్ హిట్ అందుకుని బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు.. దీంతో నాగ్ యాంటీ ఫ్యాన్స్ ఇక నుండి జగపతిబాబు లా సపోర్టింగ్ రోల్స్ చేసుకోవాల్సిందే అంటూ సెటైర్స్ వేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: