గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన భారీ అంచనాల నడుమ తమిళ్ తో పాటు తెలుగు ,  కన్నడ ,  మలయాళ , హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి.

ఇది ఇలా ఉంటే పొన్నియన్ సెల్వన్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ విడుదల అయ్యి 11 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది.  ఈ 11 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
నైజాం : 4.73 కోట్లు .
సీడెడ్ : 84 లక్షలు .
యు ఏ : 71 లక్షలు .
ఈస్ట్ : 56 లక్షలు .
వెస్ట్ : 43 లక్షలు .
గుంటూర్ : 53  లక్షలు .
కృష్ణ : 53 లక్షలు .
నెల్లూర్ : 35 లక్షలు .
11 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పొన్నియన్ సెల్వన్ మూవీ 8.68 కోట్ల షేర్ , 16.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా పొన్నియన్ సెల్వన్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా ,  చియాన్ విక్రమ్ ,  కార్తి , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష ఇతర ముఖ్య పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: