ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి హిట్ కొట్టారు డైరక్టర్ అజయ్ భూపతి. ఇక ఆ సినిమాతో ఒక్క సారిగా హీరోలు అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నారాయన.ఇకపోతే మొదటి సినిమాతోనే ముచ్చెమటలు పట్టించిన ఈ డైరక్టర్ .. తప్పకుండా భవిష్యత్తులో పెద్ద దర్శకుడు అవుతాడని ప్రతి ఒక్కరు కూడా భావించారు. అయితే  ఇక ఆయన తన రెండవ సినిమా చేయడానికి చాలా రోజుల సమయాన్ని తీసుకోవడం కొంతమందిని ఎంతగానో ఆశ్చర్యపరిచింది.ఇక  మొత్తానికి మహాసముద్రం టైటిల్ తో ఓ సినిమాను చాలా రోజుల తర్వాత రూపొందించి విడుదల చేయగా ఆ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడం ఈ దర్శకుడికి అవకాశాల కరువు ఏర్పడింది.

కాగా  ఆ సినిమా డిజాస్టర్ అవటం ఆయన్ని పూర్తిగా నిరాశపరిచింది.అయితే ఈ సినిమాని చాలా మంది హీరోలు రిజెక్ట్ చేసారు. ఇక చాలా మంది సన్నిహితులు ఈ సినిమా చేయవద్దని అన్నారట.అయితే  అయినా ఈ దర్శకుడు ఎవరేమీ చెప్పినా వినకుండా మహాసముద్రం సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ సినిమా ను మొదలుపెట్టాడు.ఇక  అందులో ఎలాంటి మార్పులు చేయకుండా మొండి పట్టుదలతో ఆ సినిమాను చేసి భారీ ఫ్లాప్ ను ఎదుర్కొన్నాడు. అంతేకాదు మొదటగా ఈ సినిమా కోసం రవితేజను హీరోగా అనుకోగా ఆయన దాన్ని రిజెక్ట్ చేశాడు.ఇక  ఆ తరువాత నాగచైతన్య హీరోగా అనుకున్నారు ఆయన కూడా చేయలేదు.

చివరగా ఈ చిత్రాన్ని శర్వానంద్ చేయగా ఆ చిత్రం ఆయనకు భారీ పరాజయాన్ని తెచ్చిపెట్టింది. ఒక సినిమా పోయినంత మాత్రాన ఆయనలోని టాలెంట్ ఎక్కడికీ పోదు. ఇక ఇప్పుడు ఆయన మరో చిత్రం రూపొందించటానికి సన్నాహాలు మొదలెట్టారు.ఇప్పుడు ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేయబోతున్నట్లు సమాచారం.అంతేకాదు  ప్రధాన పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ ని ఎంచుకోబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు తన కథతో హీరోయిన్స్ ని కలిసి కథ వినిపిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇదిలావుండగా ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉంది.అయితే  ఓ పెద్ద బ్యానర్ వారే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు వినిపిస్తోంది.  అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.ఇక  ఈ సారి ఆర్ ఎక్స్ 100 ని మించిన హిట్ కొడతారని, స్క్రిప్టు ఆ స్దాయిలో చేసారని మాత్రం చెప్పుకుంటున్నారు. అయితే ఓ రకంగా ఇది ఈ డైరక్టర్ కు కీలకమైన పరీక్ష సమయం. ఇక హిట్ కొడితే నిలబడగలుగుతారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: