తమిళ హీరో శివకార్తికేయన్‌కు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ఉంది. 'రెమో', 'డాక్టర్‌', 'డాన్‌' వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం ఈయన నటించిన 'ప్రిన్స్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. 'జాతిరత్నాలు' ఫేం అనుదీప్ కేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
తమిళ హీరో శివకార్తికేయన్‌కు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ఉంది. ‘రెమో’, ‘డాక్టర్‌’, ‘డాన్‌’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘ప్రిన్స్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ కేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు, ట్రైలర్‌ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్‌ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్‌ జరిగినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. థియేట్రికల్‌ అండ్ నాన్‌ థియేట్రికల్‌ హక్కులు కలిపి ప్రిన్స్ మూవీకి దాదాపు రూ.120 కోట్ల వరకు బిజినెస్‌ జరిగిందట. ఇక తెలుగులో ఈ సినిమాకు రూ.10 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్ జరిగింది. శివ కార్తికేయన్‌ గత చిత్రాలు డాక్టర్‌, డాన్‌ వంటివి రూ.2 కోట్ల లోపే బిజినెస్ జరిగిపుకున్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా రూ.8 కోట్లకు పైగా పెరిగింది. అయితే ఇంత మేర బిజినెస్‌ జరగడానికి దర్శకుడు అనుదీప్ క్రేజ్‌ కూడా తోడైంది. తన మార్క్ కామెడీతో ‘జాతిరత్నాలు’ సినిమాతో ఏకంగా రూ.40 కోట్ల వరకు షేర్‌ను సాధించాడు. ఈ సినిమాతో ఇంకా ఎన్ని వండర్స్ క్రియేట్‌ చేస్తాడో అని ప్రేక్షకులు ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నారు.

రోమ్‌-కామ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్‌, శాంతి టాకీస్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించాయి. శివ కార్తికేయన్‌కు జోడీగా మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తుంది. సత్యరాజ్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన అన్ని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు చివరి వారంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ పలు కారణాల వల్ల దీపావళికి పోస్ట్‌పోన్‌ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: