అది ప్రాంక్ వీడియో కానే కాదు.. నేను నిజంగానే అలా అన్నాను.. లేదంటే నా వాష్‌రూమ్‌లో కూడా కెమెరాలు పెట్టేలా ఉన్నారు''


అంటూ రష్మీ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. రష్మీ గౌతమ్ (Rashmi Gautam), నందు (Nandu) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'బొమ్మ బ్లాక్‌బస్టర్' (Bomma Blockbuster). ఎప్పుడో ప్రారంభమైన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ.. ఎట్టకేలకు నవంబర్ 4న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ పబ్లిసిటీపై దృష్టిపెట్టిందట.. అందులో భాగంగా.. రష్మీని ప్రమోషన్స్‌కి రావాలని చిత్రయూనిట్ ఎంతగా ప్రయత్నించినా.. ఆమె దొరకడం లేదంటూ.. తాజాగా నందు ఓ వీడియోని సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో.. ''రష్మీ సినిమా ప్రమోషన్స్‌కి రావడం లేదు. మేము ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. పొగరు చూపిస్తుంది.. అందుకే ఆమె ఫొటోషూట్‌లో పాల్గొంటున్న ప్లేస్‌కి వచ్చాము..'' అని తెలుపుతూ.. రష్మీని కలిసి ''నువ్వు ఎందుకు ప్రమోషన్స్‌కు రావు'' అంటూ నందు ప్రశ్నించాడు. 'సినిమా గురించి పలు రకాలుగా ప్రశ్నలు అడుగుతారు.. వాటికి నేను సమాధానం చెప్పలేను.. అందుకే రాలేను' అని రష్మీ చెప్పుకొచ్చిందట . తర్వాత ఇదంతా ప్రాంక్ అంటూ నందు చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో చిత్రయూనిట్ ముచ్చటించింది. దీనికి రష్మీ కూడా హాజరైంది. మాటల్లో ఆ ప్రాంక్ వీడియో గురించి ప్రస్తావన రాగా.. రష్మీ ఆ వీడియోపై క్లారిటీ కూడా ఇచ్చింది.


''అది ప్రాంక్ వీడియో కాదు. నేను ప్రమోషన్స్‌కి వస్తానని చెప్పాను. అయితే ఈ సినిమా అసలు విడుదలవుతుందో.. లేదో అనే పరిస్థితిలో ఉండగా.. సడెన్‌గా విడుదల అన్నారు. నేను వాళ్లు వచ్చిన టైమ్‌లో వేరే షూట్‌లో ఉన్నాను. వస్తావా? లేదా? అంటూ అసలాగడం లేదు. నేను వేరే షెడ్యూల్‌లో ఉండగా.. వారు ఆ షూట్‌కి వచ్చేశారు. వచ్చినవాళ్లు ఏమైనా కామ్‌గా ఉన్నారా? నన్ను రెచ్చగొట్టారు. అందుకే ప్రమోషన్ చేయను.. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాను. అసలు జరిగింది అది. అది ప్రాంక్ కాదు.. నేను ప్రమోషన్స్‌కి వస్తానని చెప్పాను.. కానీ వాళ్లకి ఆగలేదు.. తొందరెక్కువైపోయిందని. నేను బాత్‌రూమ్‌లో కూర్చుని ఉంటే కూడా కెమెరాలు పెట్టేట్లు ఉన్నారని 2 డేస్ ఆగండి వచ్చేస్తా.. అంటే లేదు, వెంటనే రావాల్సిందే.. అంటారు. అందుకే అలా అన్నాను.. ఇది అసలు విషయం'' అని రష్మీ గౌతమ్ ఈ వీడియోపై వివరణ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: