
ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో రచితా రామ్‌కు జతగా హీరో జైద్ ఖాన్ నటిస్తున్నాడు. దర్శకుడు అనిల్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని లోకి సినిమాస్ బ్యానర్‌పై కె.వి.అని ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. నిర్మాతలు అఖిల్ కుమార్ మరియు సంతోష్ శేఖర్, కథతో పాటు విజువల్స్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. సినిమా వచ్చే ఏడాది జనవరి 23న థియేటర్లలో విడుదల కానుంది. రచితా రామ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం నుంచి ఓ ఇంటెన్స్ పోస్టర్ విడుదలైంది. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అందులో రచితా రామ్ ఒక లేడీ డాన్ లుక్‌లో కనిపించి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆమె పల్చని బ్లాక్ డ్రెస్‌లో బాత్రూమ్‌లో టాయిలెట్ సీటుపై కూర్చొని సిగరెట్ తాగుతూ కనిపించింది. ఈ లుక్ ఎంత బోల్డ్‌గా ఉందో చెప్పలేము — ఆమె కెరీర్‌లో ఇదే అత్యంత రిస్కీ అండ్ ఇంటెన్స్ లుక్‌గా అభిమానులు చెబుతున్నారు.
అంతేకాదు, ఆ పోస్టర్‌లో ఆమె పక్కనే మంటల్లో కాలిపోతున్న గిటార్, వెనక బాధతో చూస్తున్న ఒక వ్యక్తి ఇమేజ్, ఇవన్నీ కలిపి పోస్టర్‌కి మరింత లోతైన అర్థాన్ని తీసుకువచ్చాయి. పోస్టర్ కింద రాసిన కోట్ “ఇందులోని జ్ఞాపకాలను తుడిచిపెట్టలేను...” అనే డైలాగ్ సినిమాకి భావోద్వేగమైన మిస్టరీ టచ్ ఇచ్చింది.ఈ పోస్టర్ ఒక్కటే సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్‌గా మారింది. నెటిజన్లు “రచితా రామ్ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తోంది”, “ఈ సినిమా ఆమె కెరీర్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్తుంది” అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో కొందరు “ఇంత బోల్డ్ లుక్ చేయడం ఒక పెద్ద రిస్క్” అని అంటున్నారు. కానీ రచితా రామ్ మాత్రం ఈ పాత్ర కోసం తనను పూర్తిగా మార్చుకుందన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.ఇప్పుడు అందరి దృష్టి “కల్ట్” సినిమా రిలీజ్‌పై నిలిచిపోయింది. సినిమా థియేటర్లలోకి రాగానే ప్రేక్షకులు ఈ లేడీ డాన్ ఎలాంటి రగడ చూపిస్తుందో చూడాలి మరి.