బిగ్ బాస్. రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ ఎంతోమంది సెలెబ్రెటీలను ఒకే వేదికపై చూపిస్తూ ప్రేక్షకులకు మరింత ఆనందాన్ని అందిస్తోంది ఈ షో.

ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆరవ సీజన్ కూడా ప్రసారమవుతున్నా సంగతి మనకి తెలిసిందే. ఇక ఇందులో 21 మంది కంటెస్టెంట్లు రాగా.. అందులో ఇప్పటికే 6 మంది దాకా ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ స్ట్రాటజీ చూపించుకోవడం కోసం టైటిల్ విన్నర్ నే బాగా టార్గెట్ గా పెట్టుకుని.. తమదైన శైలిలో ఆటను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ 6 లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్న ఆర్జే సూర్యా గురించి ఈ విషయాలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరీ 

 
ప్రస్తుతం సెలబ్రిటీలుగా తమ కెరీర్ ను కొనసాగిస్తున్న ఎంతోమంది సెలబ్రిటీలు.. నిజ జీవితంలో ఎంతో దుర్భరమైన జీవితాన్ని కూడా గడిపారు. ఇలాంటి వారిలో బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆర్జే సూర్య కూడా పెద్దా ఒకరనే చెప్పాలి. అయితే తిండి కూడా లేని పరిస్థితులను ఆర్జె సూర్య ఎదుర్కొన్నారట. ఈ మధ్యకాలంలో ఈయన కొన్ని సినిమాలలో కూడా నటించగా.. ఆ సినిమాలు సైతం ఆర్జే సూర్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. గుంటూరు టాకీస్, గరుడవేగ వంటి సినిమాలలో నటించారు. ఇక ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న ఒక న్యూస్ ప్రోగ్రాం ద్వారా మంచి పేరును కూడా సంపాదించుకోవడం జరిగింది. ఇక సూర్య ది తూర్పుగోదావరి జిల్లాలోని పసువులంక. ఇక వీరి తల్లిదండ్రులు కూలి పని చేసుకునే వారని మనకు తెలిసిన సమాచారం సమాచారం.

 
కష్టపడితే డొక్కాడని పరిస్థితుల్లో బాల్యంలోనే డబ్బు సంపాదించే ప్రయత్నం చేశారట ఆర్ జె సూర్య. అలా సోడా సీసాలు కడిగే వాడని.. అలా పనిచేయడం ద్వారా వచ్చిన డబ్బులతో కడుపునిండా భోజనం చేసేవాడని సూర్యా వెల్లడించారు. పీజీ తర్వాత సూర్య ప్రముఖుల వాయిస్లను మిమిక్రీ చేయడానికి ఎంతగానో ఇష్టపడే వాడట. మిమిక్రీ చేయడం వల్ల సూర్య.. ప్రశంసలతో పాటు మెడల్స్ ను కూడా తన సొంతం చేసుకున్నారు. చిన్నప్పుడు తినడానికి కూడా ఎన్నో అవస్థలు పడ్డ ఆర్ జె సూర్య ప్రస్తుతం మంచి స్థానంలో ఉన్నారని చెప్పాలి.ఇక బిగ్ బాస్ షో తర్వాత ఈయన రేమునిరేషన్ కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: