తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ప్రస్తుతం వరస విజాయలను బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. కొంత కాలం క్రితమే శివ కార్తికేయన్ "డాక్టర్" అనే మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత డాన్ అనే మూవీ లో శివ కార్తికేయన్ హీరోగా నటించాడు. ఆ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇలా రెండు వరస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న శివ కార్తికేయన్ తాజాగా ప్రిన్స్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కే వీ దర్శకత్వం వహించాడు. ప్రిన్స్ మూవీ ఈ రోజు అనగా అక్టోబర్ 21 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ లో శివ కార్తికేయన్ హీరోగా నటించడం , ఈ మూవీ కి అనుదీప్ కె వి దర్శకత్వం వహించడంతో ప్రిన్స్ మూవీ పై తెలుగు మరియు తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పరవాలేదు అనే రేంజ్ లో థియేటర్ లలో విడుదల అవుతుంది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎన్ని థియేటర్ లలో విడుదల కాబతుందో తెలుసుకుందాం.

ప్రిన్స్ మూవీ నైజాం ఏరియాలో 95 థియేటర్ లలో విడుదల కాబోతోంది. సిడెడ్ ఏరియాలో ఈ మూవీ 50 థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఆంధ్ర ఏరియాలో ఈ మూవీ 145 థియేటర్ లలో విడుదల కాబోతుంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ప్రిన్స్ మూవీ 290 థియేటర్ లలో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: