మంచు విష్ణు హీరోగా చాలా రోజుల తరువాత జిన్నా సినిమాతో ముందుకు వచ్చాడు. సూర్య ఈ సినిమాకి దర్శకుడు.పాయల్ రాజ్ పుత్ హీరోయిన్. సన్నీ లియాన్ ఇంపార్టెంట్ రోల్ పోషించింది. ఇక టీజర్, ట్రైలర్స్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమా (అక్టోబర్ 21న) ఈరోజు ప్రపంచవ్యా్ప్తంగా విడుదలైంది.సినిమా ఎలా ఉందంటే..ఈ సినిమాని నడిపించేది సన్నీ లియోన్. ఆమె పోషించిన రేణుక పాత్రలో వచ్చే ట్విస్ట్ సినిమాకు మంచి మలుపు. సినిమా ఓ వైపు కామెడీ, మరోవైపు హారర్ ఛాయలతో సాగుతుంది. అయితే ఇలాంటి సీన్స్ చాలా సినిమాల్లో చూశాం కదా అనిపిస్తుంది ప్రేక్షకుడికి. ఈ సినిమాకు మూల కథను అందించిన ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనదైన శైలిలో వినోదాన్ని బాగానే అందించాడు. కోన వెంకట్ స్క్రీన్ ప్లే కూడా పరవాలేదనిపిస్తుంది. ఇక ఫస్టాఫ్ కంటే సెకాండ్ మరింత ఆకట్టుకుంటుంది. అనూప్ రూబెన్స్ సంగీతం చాలా చాలా బాగుంది. అతని పాటల్లో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. థియేటర్లో వింటే చాలా బాగా నచ్చుతాయి.


ఇక జిన్నాగా మంచు విష్ణు మంచి నటనను ప్రదర్శించాడు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాల్లో చాలా బాగా నటించాడు. ముఖ్యంగా విష్ణు డ్యాన్సులు చాలా బాగున్నాయి. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. సన్నీలియోన్ విషయానికి వస్తే తన గ్లామర్‌తో ఆమె మరోసారి వావ్ అనిపించింది. చెప్పాలంటే తనదే ఈ సినిమాలో అన్నిటికంటే హైలెట్ పాత్ర. ఇక మిగతా పాత్రల్లో నటించిన వెన్నెలకిషోర్, సద్దాం, చంద్ర, నరేష్ కామెడీని తమదైన శైలిలో పండించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర కోసం రాసిన డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి. మొత్తానికి చాలా కాలం తరువాత మంచు విష్ణు నుంచే కాదు మంచు కాంపౌండ్ నుంచో మంచి హిట్ సినిమా వచ్చింది. మరి ఈ సినిమాకి వసూళ్లు ఎలా వస్తాయో.. మున్ముందు రోజుల్లో జనాలు ఈ సినిమాని ఎలా ఆదరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: