బిగ్ బాస్ 6 లో అందరికీ వంట చేసి పెట్టి అందరి చేత శభాష్ అనిపించుకుంది. అంతేకాదు అందరినీ కమాండ్ చేస్తూ లేడీ బాస్ అన్న ట్యాగ్ ను కూడా జోడించుకుంది.కానీ ఆరవ వారంలో షో నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం హౌస్ లో ఉన్న వారందరినీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురిచేసింది. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీ అయింది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది సుదీప అలియాస్ పింకీ. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఇంటర్వ్యూలో భాగంగా సుదీప మాట్లాడుతూ.. నా మొదటి సినిమా ఎం ధర్మరాజు ఎంఏ.. ఈ సినిమా రచయిత వేమూరి సత్యనారాయణ తో మా తాత గారికి పరిచయం ఉంది. ఈ మూవీ కోసం చెన్నై నుంచి తీసుకొచ్చిన అమ్మాయి సమయానికి చేయననడంతో రాజమండ్రిలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుందంటే చూడడానికి వెళ్ళినప్పుడు.. మా మనవరాలికి ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా పాత్ర ఉంటే ఇవ్వండి అని తాతగారు అన్నారు . అలా చెన్నై అమ్మాయి హ్యాండ్ ఇవ్వడంతో నన్ను తీసుకున్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. నాకు మంచి గుర్తింపు లభించింది. ఇక 7/G బృందావన కాలనీ సినిమా కోసం నల్లగా, సన్నగా ఉండాలని చెప్పారు. అందుకోసం ప్రతిరోజు గంటసేపు ఎండలో నిలబడే దాన్ని.. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ వి 9 సినిమాలు ఒకేసారి మొదలయ్యాయి..

అందులో ఐదు సినిమాలకు నేను సంతకం చేశాను. కానీ చాలా చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఉదయ్ కిరణ్ చాలా సాఫ్ట్ గా ఉంటాడు ..మనం కొంచెం డల్ గా కనిపిస్తే చాలు.. ఏమైంది? ఏం జరిగింది? ఏదైనా ఇబ్బందా? అని అడిగే తత్వం ఆయనది. సంతోషాన్ని పంచుకోకపోయినా బాధను పసిగట్టి ఓదార్చే మనిషి. అతనితో నేను చేసిన చివరి చిత్రం వియ్యాలవారి కయ్యాలు సినిమా చేశాను. అలాంటి వ్యక్తికి ఏ కష్టం వచ్చిందో ఆత్మహత్య చేసుకుని అందరిని వదిలేసి వెళ్లిపోయాడు. కానీ ప్రజల మనసులో మాత్రం శాశ్వతంగా నిలిచిపోయాడు అంటూ ఎమోషనల్ అవుతూ ఉదయ్ కిరణ్ గురించి వెల్లడించింది సుదీప.

మరింత సమాచారం తెలుసుకోండి: